వైసీపీ లో వలస నేతల ఇబ్బందులు ? 

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి వలసలు చోటు చేసుకోవడం సర్వ సాధారణమైన విషయమే.

ఇది ఏళ్ల తరబడిగా వస్తున్న ఆచారం కింద మారిపోయింది.

ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వారి స్థాయికి తగ్గట్టుగా అధికార పార్టీ పెద్దపీట వేస్తుంది.ఎన్నో కీలక పదవులు ఇస్తామని హామీలు ఇస్తూ, వారిని తమ పార్టీలో చేర్చుకుని మరింత బలమైన పార్టీగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తాయి.

గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఇదేవిధమైన పరిస్థితి ఏర్పడింది.వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకుని చాలామందికి మంత్రి పదవులను చంద్రబాబు కట్టబెట్టారు.

మిగిలిన వారికి కీలకమైన పదవులను కట్టబెట్టి వారికి ప్రాధాన్యం ఇచ్చారు.అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అదే విధమైన వలసలు ఉంటాయని భావించినా,  జగన్ పెట్టిన కొన్ని కొన్ని కండిషన్ల కారణంగా కొంతమంది వెనకడుగు వేశారు.

Advertisement

       ఇక టిడిపి నుంచి ఎమ్మెల్సీలు చాలా మంది వైసీపీ కండువా కప్పుకున్నారు.వారిలో చాలామందికి మళ్లీ వైసీపీ తరుపున ఎంఎల్సి గా జగన్ అవకాశం కల్పించారు.

అయితే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ,  కరణం బలరాం , వాసుపల్లి గణేష్ , జనసేన నుంచి వచ్చిన రాపాక వర ప్రసాద్ వంటి వారికి పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితి ఏర్పడింది.జగన్ వరకు బాగానే ప్రాధాన్యం ఇస్తున్న,  నియోజకవర్గంలోని వైసీపీ నాయకులకు టిడిపి నుంచి వచ్చిన వారికి ఏ మాత్రం పోసగడం లేదట.

అలాగే గతంలో చంద్రబాబు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇచ్చినంత ప్రాధాన్యం జగన్ ఇవ్వకపోవడం పైన వలస నేతలు ఆవేదన చెందుతున్నారట.అలాగే వచ్చే ఎన్నికల్లో గెలిచే శక్తి సామర్ధ్యాలు ఉన్న వారు తక్కువగా ఉండటంతో తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది అనేది చాలా మంది వలస నాయకుల ఆవేదన.   

  ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులను అప్పగిస్తే ముందు నుంచి పార్టీలో ఉన్న వారు తీవ్ర అసంతృప్తికి గురి అవుతారని, చంద్రబాబుకు తనకు పెద్దగా తేడా ఏమి ఉండదనేది జగన్ అభిప్రాయమట.అందుకే వలస నాయకులకు పెద్దగా  ప్రాధాన్యం ఇవ్వట్లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారుట.

నేడు జనసేనలోకి బాలినేని .. పవన్ పెట్టిన కండిషన్స్ ఏంటి ?
Advertisement

తాజా వార్తలు