జగన్ తెలివికి అదిరి బెదిరిపోతున్న ఎమ్మెల్యే లు ?

151 సీట్లతో ఏపీలో అఖండ మెజారిటీతో వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు.

 Mlas Concerned Over Pics Knowing Constituency Wise Feedback Jagan, Ysrcp, Const-TeluguStop.com

అయితే మధ్యలో కొన్ని కొన్ని కారణాలవల్ల వైసీపీ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిందని , రాజకీయ ప్రత్యర్థులు బాగా బలం పెంచుకున్నారని ఇక ముందు ముందు వైసీపీకి కష్టకాలమే అని ఎన్నో సంకేతాలు వచ్చాయి.అయినా, జగన్ తన పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో జగన్ సత్తా ఏమిటో అందరికీ అర్థమైపోయింది.ప్రజలు వైసీపీ ప్రభుత్వం వైపు ఉన్నారని, ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.

అయితే జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లో ప్రభుత్వంలో అంతా తామే కీలకం అవుతామని,  తాము అత్యంత రాజకీయ సీనియర్లము అని,  జగన్ కు పరిపాలన అనుభవం లేకపోవడంతో తామే చక్రం తిప్ప వచ్చు అని కొంతమంది వైసీపీలో నాయకులు అంచనా వేశారు.

Telugu Cmo, Constency, Jagan, Mayer, Ysrcp-Telugu Political News

కానీ జగన్ మాత్రం ఎక్కడ ఎవరి పెత్తనం ప్రభుత్వంలో కనిపించకుండా వ్యూహాత్మకంగా పని చేసుకుంటూ వెళుతున్నారు.నియోజకవర్గాల్లో పర్యటించకుండానే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది నివేదిక రూపంలో జగన్ కు చేరిపోతుంది.ఇటీవల జరిగిన మున్సిపల్,  కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, చైర్మన్ మేయర్ లను ఎంపిక చేసే వరకు ఎక్కడా ఎమ్మెల్యేల ప్రభావం లేకుండా జగన్ సైలెంట్ గా ఎవరి ఊహకు అందకుండా ఎంపికలు పూర్తిచేశారు.

ఇదంతా క్షేత్రస్థాయిలో ఫీడ్ బ్యాక్ ఆధారంగానే.ఎమ్మెల్యేలకు సైతం తెలియని ఎన్నో అంశాలు నియోజకవర్గం నుంచి జగన్ కు చేరిపోతున్నాయి .ఎవరెవరు ఏం చేస్తున్నారు పార్టీకి ఎవరు మేలు, కీడు చేస్తున్నారు ? ఎవరి కారణంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది ఉండదు ?  నియోజకవర్గ రాజకీయ ప్రత్యర్థుల బలం ఏ విధంగా ఉంది ఇలా ఎన్నో అంశాలను ఎమ్మెల్యేలు ప్రమేయం లేకుండానే జగన్ తెలుసుకోగలుగుతున్నాడు.దాని ఆధారంగానే ఎప్పటికప్పుడు తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు.

దీంతో ఎమ్మెల్యేల్లో మరింత భయం పెరిగిపోయింది.

నియోజకవర్గాల్లో చీమ చిటుక్కుమన్నా జగన్ కు తెలిసిపోతుందని, జాగ్రత్తగా పరిపాలన విషయంలో తాము ఉండకపోతే , రాబోయే ఎన్నికలలో తమ సీటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట.

జగన్ ఈ విధంగా సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే లకు ముచ్చెమటలు పట్టించేస్తుండడంతో  వైసీపీ ఎమ్మెల్యే ల మధ్య ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube