గర్భిణికి ఆపరేషన్ చేసిన ఎమ్మెల్యే..!

పురుటినొప్పులతో బాధపడతున్న ఓ గర్భిణిని పురుడు పోశాడు ఓ ఎమ్మెల్యే.వృత్తిరీత్య గైనకాలజిస్ట్ అయిన తను రాజకీయం మీద మక్కువతో, ప్రజలకు సేవ చేయాలనే భావనతో రాజకీయాల్లో అడుగుపెట్టాడు.

 Ijwal, Mla, Women, Delevery-TeluguStop.com

మిజోరాంలోని చాంఫై నార్త్ ఎమ్మెల్యే జడ్ఆర్ థైమ్సంగా ఇటీవల నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో పర్యటించాడు.నియోజకవర్గంలో తలెత్తిన భూకంప సమస్య, కరోనా తీవ్రతతో పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించాడు.

మిజోరాంలోని చాంఫై నార్త్ నియోజకవర్గంలోని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే జడ్ఆర్ థైమ్సంగా దగ్గరికి వచ్చారు.నాగూర్ గ్రామంలో నెలలు నిండిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిపారు.

 Ijwal, Mla, Women, Delevery -గర్భిణికి ఆపరేషన్ -TeluguStop.com

దీంతో ఎమ్మెల్యే థైమ్సంగా చాంఫై ఆస్పత్రికి తరలివెళ్లాడు.కరోనా వల్ల, అనారోగ్య సమస్యలతో అక్కడి ఆస్పత్రి డాక్టర్లు సెలువులో ఉన్నారు.

దీంతో ఎమ్మెల్యే వృత్తిరీత్య గైనకాలజిస్ట్ డాక్టర్ కావడంతో డాక్టర్ కోటు వేసుకుని తిరిగి బాధ్యతలు చేపట్టారు.గర్భిణిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు సిబ్బంది.

గర్భిణికి నార్మల్ డెలివరీ కష్టమవ్వడంతో ఆమెను సీజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను భయటకు తీశారు.ఆపరేషన్ సక్సెస్ అవడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.

ఎమ్మెల్యే గర్భిణికి ఆపరేషన్ చేసి తల్లిబిడ్డను కాపాడినందుకు పలువురు ఎమ్మెల్యేను మెచ్చుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube