దేవుడా.. ఇంట్లోనే కరెంట్ స్తంభం.. ఆమె చెప్పింది విని షాకైన ఎమ్మెల్యే..

కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్య పరుస్తాయి.వాటిని వింటే అస్సలు నమ్మబుద్ది కాదు.మన కళ్ళతో చుస్తే కానీ నమ్మలేం.అలంటి సంఘటనే ధర్మవరం నియోజక వర్గంలో జరిగింది.మాములుగా మనం కరెంట్ స్తంభాలను ఎక్కడ చూస్తాం.మన ఇంటి బయట మన వీధిలో చూస్తాం.

 Mla Shocked By Seeing Electricity Poll In House-TeluguStop.com

కానీ ఇక్కడ ఆశ్చర్యంగా కరెంట్ స్తంభం ఒక ఇంట్లో ఉంది.

కరెంట్ స్తంభాన్ని మనం ముట్టుకోవాలంటేనే భయపడతాం.

 Mla Shocked By Seeing Electricity Poll In House-దేవుడా.. ఇంట్లోనే కరెంట్ స్తంభం.. ఆమె చెప్పింది విని షాకైన ఎమ్మెల్యే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఒక ఇంట్లో దాదాపు 15 సంవత్సరాలుగా ఆ స్తంభాన్ని పెట్టుకుని వారు దినదిన గండంగా జీవితం గడుపుతున్నారు.అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో ఆ కరెంట్ స్తంభం వారింట్లో భాగమయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ధర్మవరం నియోజక వర్గం గొట్లూరు గ్రామానికి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కేతి రెడ్డి వెళ్ళారు.

ఆ గ్రామంలో ఒక ఇంట్లో ఉన్న కరెంట్ పోల్ చూసి ఎమ్మెల్యే కేతి రెడ్డి ఏంటమ్మా మీ ఇంట్లో కరెంట్ పోల్ ఉంది అని ప్రశ్నించగా.ఆమె అసలు విషయం చెప్పడంతో ఎమ్మెల్యే ఒక్కసారిగా షాక్ అయ్యారు.

గొట్లూరు గ్రామానికి చెందిన భాగ్యమ్మకు 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి స్థలం మంజూరు చేసారు.అయితే ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అప్పటికే కరెంట్ పోల్ ఉండడంతో ఆమె అధికారులకు చెప్పింది.కానీ వారు ఆ ఫిర్యాదును పట్టించుకోక పోవడంతో ఆమె ఆ కరెంట్ స్తంభాన్ని అలానే ఉంచి ఇల్లు కట్టుకుంది.ఆ స్తంభం కరెక్ట్ గా వంటగదిలో వచ్చింది.

కానీ దాని కారణంగా ఆ ఇంట్లో వారంతా గత 15 సంవత్సరాలుగా కరెంట్ షాక్ కొడుతుందేమోనని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.వర్షాకాలంలో అయితే ఆ వంటగదిలోకి వెళ్లకుండా పక్కింటి వారి సహాయంతో వంట చేసుకుంటుంది.

ఏ విషయాన్నీ తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి విద్యుత్ అధికారులకు ఆ స్తంభాన్ని వెంటనే తొలగించాలని సూచించారు.

#Shocked #Dharmavaram Mla #GoodMorning #House #Kethi Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు