గోమూత్రం తాగి క‌రోనాను తరమండి అంటున్న ఎమ్మెల్యే..!

ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది.వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలను విడుస్తున్నారు.

 Mla Says Drink Cow Urine And Move Corona-TeluguStop.com

సరైన వైద్య వసతులు లేక, ఆక్సిజన్ అందక, బెడ్లు ఖాళీగా లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.క‌రోనా వైరస్ వ్యాప్తిని అంతం చేయడానికి, ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి ప్ర‌భుత్వాలు టీకాలు పంపిణీ చేస్తున్నాయి.

ప్రజలు బయట తిరిగి కరోనాను కొనితెచ్చుకోకుండా లాక్‌డౌన్‌లు, క‌ర్ఫ్యూలు విధిస్తున్నాయి.అయినప్పటికీ చాలా మంది ప్రభుత్వ నిబంధనలను గంగలో కలుపుతున్నారు.

 Mla Says Drink Cow Urine And Move Corona-గోమూత్రం తాగి క‌రోనాను తరమండి అంటున్న ఎమ్మెల్యే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారు.అయితే కరోనాను కట్టడి చేయడానికి గోమూత్రం ఒక బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తుంద‌ని, దానిని ప్ర‌తిరోజూ తాగాల‌ని ఓ ఎమ్మెల్యే పిలుపునిచ్చాడు.

ప్రజలకు అందరూ గోమూత్రాన్ని తీసుకుని వైరస్ ను అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.తాను ఆరోగ్యంగా ఉండ‌టానికి అదే కార‌ణ‌మ‌ని చెప్పాడు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బైరియా నియోజ‌వ‌ర్గ‌ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ప్ర‌తిరోజు గోమూత్రం తాగ‌డం వ‌ల్ల క‌రోనాను నిలువ‌రించ‌వ‌చ్చ‌ని చెప్పారు.అది ఆరోగ్యానికి చాలా మంచిద‌ని వెల్ల‌డించారు.

తాను రోజులో 18 గంట‌లు ప‌నిచేయ‌డానికి అదే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించారు.రెండు లేదా మూడు మూత‌ల గోమూత్రాన్ని ఒక గ్లాసు నీళ్ల‌లో క‌లుపుకొని ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే తీసుకోవాల‌ని తెలిపారు.

ఆవు పంచకం తీసుకున్న అర‌గంట వ‌ర‌కు ఎలాంటి ప‌దార్థాలు తిన‌డం కానీ తాగ‌డం కానీ చేయ‌వ‌ద్ద‌ని కూడా సూచించారు.ఇలా చేయ‌డం వ‌ల్ల కేవ‌లం క‌రోనాను మాత్ర‌మే కాకుండా అనేక రోగాల‌ను న‌యం చేయ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని, ప్ర‌త్యేకంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

తాను ప్ర‌తిరోజూ తాగుతాన‌ని అందువ‌ల్లే ఆరోగ్యంగా ఉన్నాన‌ని చెప్పారు.గోమూత్రాన్ని ఎలా తాగాలి, ఎంత మొత్తం తీసుకోవాల‌ని వివ‌రిస్తూ ఆయన రూపొందించిన విడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

#Carona Virus #COVID-19 #Drinking #Cow Urine #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు