జబర్థస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న ఎమ్మెల్యే రోజా..?

తెలుగులో జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షో తెచ్చుకోలేదు.శ్యాం ప్రసాద్ రెడ్డికి చెందిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది.

 Mla Roja To Re Enter Jabarthast-TeluguStop.com

మధ్య మధ్యలో చాలామంది కంటెస్టెంట్స్ మారారు, జడ్జిలు మారారు కానీ షో మాత్రం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది.ఈ మధ్యకాలంలో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ కావడంతో ఆమె స్థానంలో ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా రోజా ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది.ఆమె షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.

 Mla Roja To Re Enter Jabarthast-జబర్థస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న ఎమ్మెల్యే రోజా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు టెలివిజన్ చరిత్రలో నెంబర్ వన్ షో అనిపించుకుంటున్న జబర్దస్త్ షో మొదలైన తర్వాత ఆమె అందులో జడ్జిగా వ్యవహరించడం మొదలుపెట్టారు.రాజకీయాల్లో సైతం యాక్టివ్గా ఉండే ఆమె ఎమ్మెల్యే కావడానికి ఈ జబర్దస్త్ కారణం అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

తాజాగా నిన్న రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో రాకింగ్ రాకేష్ స్కిట్ చర్చనీయాంశంగా మారింది.మరి కొన్నేళ్ల తరువాత జబర్దస్త్ ప్రోగ్రాం ఎలా ఉంటుంది అన్న ఊహతో ఆయన ఒక స్కిట్ చేయగా ఈ స్కిట్ సందర్భంగా జబర్దస్త్ లోని అందరూ ఎమోషనల్ అయ్యారు.

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులు తమకు జబర్దస్త్ కి ఉన్న అనుబంధం అలాగే జబర్దస్త్ కు తమకు ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పుకొచ్చారు.జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కూడా ఆసక్తికరంగా స్పందించారు.

తాను హీరోయిన్ గా మారి దాదాపు 27 ఏళ్లు అయిందని, అయితే ఈ 27 ఏళ్లు తనకు ప్రేక్షకుల నుంచి ఎంత ప్రేమ దక్కుతుందో తనకు తెలిసేది కాదని కానీ మొట్టమొదటిసారి జబర్దస్త్ ద్వారా ఎంత ప్రేమ దక్కుతుంది అనేది కళ్లారా చూస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

#Minister #Re-Entry #MLA Roja #Fans #Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు