బాబు గారికి రోజా దెబ్బ గట్టిగానే తగిలిందిగా..     2018-07-17   14:11:03  IST  Sai Mallula

తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కాని ఎవరు చేసిన బాబు గారిని మటుకూ బలే బుక్ చేస్తారు..టీటీడీ పాలకమండలి తాజగా తీసుకున్న నిర్ణయంతో రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నిజమనేలా ఉన్నాయని అయితే తప్పకుండా చంద్రబాబు టీటీడీ పై కుట్ర జరిగిందని అంటున్నారు వైసీపీ నేత రోజా అందుకే టీటీడీ మళ్ళీ ఈ వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుందని సంచలన ఆరోపణలు చేశారు..దాంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగిరాక తప్పలేదు..ఇంతకీ రోజా వ్యాఖ్యలకి బాబు ఎలాంటి స్పందన ఇచ్చారు అసలేం జరిగింది అనే వివరాలలోకి వెళ్తే..

రమణ దీక్షితులు టీటీడీ పై అదేవిధంగా తిరుమలలో నగలు అపహరణకి గురయ్యాయి…త్రవ్వకాలు జరిగాయి అంటూ ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ విధితమే అయితే ఈ వార్తల నేపధ్యంలోనే వైసీపీ దీక్షితులకి మద్దతు తెలిపింది..అదేసమయంలో బీజేపీ సైతం దీక్షితులకి వత్తాసు పాడింది అయితే గడిచిన కొన్ని రోజులగా దీక్షితులు ఎక్కడా కనపడలేదు సరికదా చాలా వరకూ అందరూ సైలెంట్ అయ్యారు అనుకున్న సమయంలో టీటీడీ సంప్రోక్షణ పేరుతో భక్తులని కొన్న్ని రోజులు గుడిలోకి రాకుండా ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా చెలరేగి పోయారు..

MLA Roja Stong Counter To Nara Chandrababu Naidu-

MLA Roja Stong Counter To Nara Chandrababu Naidu

టీటీడీలో జరిగిన అక్రమాల గుట్టు బయటపడకుండా సంప్రోక్షణ పేరుతో గుడిని మూసేవేసి ఏదో రాజకీయ చేస్తున్నారు టీటీడీ చంద్రబాబు కలిసి నాటకాలు ఆడుతున్నారు పవిత్రమైన తిరుమలలో ఏమి చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేగింది..దాంతో ఒక్క రోజా మాత్రమే కాదు వ్యవహారాలు ఎన్నో ఏళ్ల నుంచి దగ్గరినుంచి చూసిన అధికారులు స్థానిక ప్రజలు కూడా గుడిని సంప్రోక్షణ పేరుతో మూసేయాలనే నిర్ణయం వెనుక మతలబు ఏదో ఉందనే అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. గుడిని మూసివేసి.. సిసీ కెమెరాలు ఆపుచేసి ఏదో చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో కూడా వ్యప్తించడంతో ప్రజలలో ఆందోళన మొదలయ్యింది దాంతో

.

ఎమ్మెల్యే రోజా చేసిన ఈ ప్రచారానికి ఊపందుకుంది ఈ వ్యవహారం రచ్చ కాకముందో చంద్రబాబు వెంటనే స్పందిచారు రోజా దెబ్బకి దిగి వచ్చారు..తిరుమల దేవాలయాన్ని మూసి వేసి గుట్టుగా చెద్దామనుకున్న పనులపై నిర్ణయాన్ని మార్చుకున్నారు. మహాసం ప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయాలని తాజాగా ఆదేశించారు… దాంతో రోజా పై భక్తులు స్థానికులు ప్రశంసలు కురిపించారు జగన్ నుంచీ గుడ్ వర్క్ అంటూ రోజా కి మెసేజ్ రావడంతో రోజా మరింతగా ఈ వ్యవహారంలో కల్పించుకుని పాప్లర్ అవ్వాలని ప్లాన్ చేస్తోందట..