సినిమా టికెట్ల విక్రయంపై ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్!

ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్ లపై కొన్ని నిబంధనలు సినిమా డిస్ట్రిబ్యూటర్ లని, నిర్మాతలను తీవ్ర సందిగ్ధంలోకి నెట్టేశాయి.ఈ క్రమంలోనే సినిమా టికెట్ల పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంచలనంగా మారాయి.

 Mla Roja Shaking Comments On Chiranjeevi And Nagarjuna-TeluguStop.com

ఈ సందిగ్ధతల నడుమ సినిమాలను థియేటర్లో విడుదల చేయాలంటే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు.

ఈ క్రమంలోనే చాలా మంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడం కంటే ఓటీటీ విడుదల చేయడం ఎంతో ఉత్తమమని భావించి చాలా సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి.

 Mla Roja Shaking Comments On Chiranjeevi And Nagarjuna-సినిమా టికెట్ల విక్రయంపై ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ సమస్యలను వివరించడానికి మెగాస్టార్ చిరంజీవి జగన్ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.

Telugu Chiranjeevi, Mla Roja, Nagarjuna, Shocking Comments-Movie

ఈ క్రమంలోనే కొద్దిరోజులలో చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ ను కలిసి సమస్యను వివరించబోతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే సినిమా టికెట్లను ప్రభుత్వమే స్వయంగా ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని అధికారికంగా వెల్లడించారు.ఇదిలా ఉండగా నేడు తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకున్న రోజా ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వం మద్యం,సినిమా టికెట్లు ఆన్లైన్లో అమ్ముకుంటున్న అంటూ విమర్శలు రావడంతో వాటిపై రోజా స్పందిస్తూ అసలు విషయం బయట పెట్టారు.చిరంజీవి నాగార్జున వంటి హీరోలే సినిమాటికెట్లను ఆన్లైన్లో విక్రయించాలని కోరడం తోనే ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందని రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

#Chiranjeevi #MLA Roja #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు