'ఆ సెంటిమెంట్'..తో రోజా సీటుకి ఎర్త్..   MLA Roja Seat Going In The Confusion In YCP     2018-10-17   11:22:14  IST  Surya

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకి విశేష ఆదరణ వస్తున్న నేపధ్యంలో పార్టీలో నేతలు అందరూ ఎంతో జోష్ గా కనిపిస్తున్నారు..తమ తమ నియోజకవర్గాలలో తమ గెలుపుకి తిరుగులేదంటూ రెట్టింపు ఉశ్చాహంతో పని చేస్తున్నారు..అయితే ముందు నుంచీ వైసీపీ కి బేస్ వాయిస్ గా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం ఎంతో సైలెంట్ అయ్యారు..వాయిస్ లో బేస్ తగ్గిందో లేక వైసీపీ అధినేత తగ్గించాడో తెలియదు కాని మొత్తానికి రోజా మాత్రం ఈ మధ్యకాలంలో ఎంతో సైలెంట్ అయ్యారట..అందుకు కారణం ఒకే ఒక్క సెంటిమెంట్

ఆ సెంటిమెంట్ ఆమె దూకుడికి కళ్ళెం వేసేలా ఉందని తెలుస్తోంది..అంతేకాదు ఆమె ఎమ్మెల్యే టిక్కెట్టు కి సైతం ఎసరు పడుతోందట..దాంతో రోజమ్మ జబర్దస్త్ షో లో నవ్వుతూ కనపడినా నిజజీవితం షో లో మాత్రం ఏమి చేయాలో పాలుపోక తన భాదని అనుచరుల వద్ద వెళ్లగక్కుతోందట..అసలు రోజా సీటుకే ఎసరు పెట్టేంత సెంటిమెంట్ ఏముంది…? రోజా కి జగన్ హ్యాండ్ ఇస్తాడా..? అనే వివాలలోకి ఒక్కసారి వెళ్తే..

నగరి టిక్కెట్ పై ఎమ్మెల్యే రోజా ఆసలు వాదులు కోవడం మంచిదని అంటున్నారు స్థానిక నేతలు.అందుకు తగ్గట్టుగా అధినేత వద్ద వారందరూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారట ఇప్పుడు అదే రోజాకి శాపం అవుతోందని నగరిలో కోడై కూస్తోంది…దానికి కారణమేమిటని ఆరా తీస్తే వినూత్నమైన వాదనకి సెంటిమెంట్ జోడించి మరీ రోజా కి ఎసరు పెడుతున్నారు…“రోజా” రెండు సార్లు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో..ఆ పార్టీ అధికారంలోకి రాలేదు…దాంతో మూడోసారి మాత్రం నగరి నుంచీ పోటీ చేసి వెంట్రుక వాసిలో విజయం సాధించింది..కానీ రోజా గెలుపు వైసీపీ నుంచీ వచ్చింది కానీ ఆ సమయంలో వైసీపీ అధికారంలోకి రాలేదు..

MLA Roja Seat Going In The Confusion YCP-

దాంతో ఇప్పుడు ఆమెకి గనుకా సీటు ఇస్తే , ఒకవేళ ఆమె గెలిస్తే…వైకాపా అధికారంలోకి రాదని స్థానిక నేతలు సెంటిమెంట్‌ని రాజేశారు.. 2014 ఎన్నికల్లో గాలి , చెంగారెడ్డిలను ఎదుర్కొని తాను గెలిచాననే విషయాన్ని మరిచిపోయి..సెంటిమెంట్‌తో ముడిపెట్టడం బాధగా ఉందని రోజా అనుచరుల వద్ద పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. ఈ రకమైన ప్రచారం కేవలం తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా అడ్డుకునేందుకు కొంత మంది స్థానిక నాయకులతో పాటు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇలా ప్రచారం చేయిస్తున్నారని ‘రోజా’ బోరుమంటున్నారట.

అంతేకాదు రోజా త్వరలో జనసేనలో చేరుతుందనే రూమర్ కూడా బాగా ప్రచారంలో ఉండటంతో రోజా విలాపానికి అంతులేదు..సెంటిమెంట్ అస్త్రంగా చూపి తనకి టిక్కెట్టు రానివ్వకుండా ఎవరెవరు లాబియింగ్ చేస్తున్నారో తనకి తెలుసునని త్వరలో జగన్ ని కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని రోజా తనకి తానూ ధైర్యం చెప్పుకుంటున్నారట. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న నగరి ప్రజలు పాపం రోజా వెటకారంగా సెటైర్స్ వేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది…ఇంతకీ సెంటిమెంట్ వర్క్అవుట్ అవుతుందా..??