నగరి ఎమ్మెల్యే గన్ మెన్ కు కూడా కరోనా!

కరోనా మహమ్మారి రోజు రోజుకు తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది.24 గంటల్లో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు నమోదు అయిన కేసులతో ప్రజల్లో ఆందోళన కలుగుతుంది.ఇప్పటివరకు 23,814 కరోనా యాక్టివ్ కేసులు నమోదవ్వగా,ఇప్పటి వరకు 277 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

 Mla Roja Gunmen Tested Positive For Covid-19, Mla Roja, Gunmen, Covid 19,ycp-TeluguStop.com

ఈ కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతల్లో కూడా ఈ కరోనా టెన్షన్ ఎక్కువవుతుంది.

ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు వారి వద్ద పనిచేసే భద్రతా సిబ్బంది,వ్యక్తిగత సిబ్బంది కూడా కరోనా బారిన పడుతుండడం కలవరానికి గురి చేస్తుంది.

తాజాగా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ కూడా కరోనా బారినపడ్డారు.తిరుపతిలోని స్విమ్స్ ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే మరో విషయం ఏంటంటే ఇటీవల ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌ తో ఇటీవల మాస్క్ లేకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తో ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.ఐతే తన ఆరోగ్యంపై ఆందోళన చెందల్సిన అవసరం లేదని, కరోనా బారినపడిన తన గన్‌మెన్ గత 18 రోజుల నుంచి సెలవులోనే ఉన్నట్లు ఆమె తెలపడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఏపీలో ఇప్పటి వరకు 23,814 కరోనా యాక్టివ్ కేసులు నమోదవ్వగా, వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.దీనితో ప్రస్తుతం ఏపీలో 11,383 కరోనా యాక్టివ్ కేసులుండగా,277 మంది ఈ మహమ్మారికి బలైపోయారు.

మరోపక్క టెస్ట్‌ల విషయానికి వస్తే.గడిచిన 24 గంటల్లో 16,882 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,500 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube