ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తి తిరస్కరణ..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ తిరస్కరించింది.ఈ మేరకు విచారణకు మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు.

గతంలో ఇచ్చిన నోటీసులో పేర్కొన్న అన్ని వివరాలతో హజరుకావాలని ఈడీ పేర్కొంది.2015 బ్యాంక్ స్టేట్ మెంట్, కంపెనీ లావాదేవీల డాక్యుమెంట్లతో రావాలని సూచించింది.అయితే ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ స్టేట్ మెంట్లు తనకు అందలేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం.

పత్రాలు తీసుకువచ్చేందుకు ఈనెల 25 వరకు సమయం కావాలని కోరుతూ ఇవాళ రోహిత్ రెడ్డి ఈడీకి లేఖలో విన్నవించిన సంగతి తెలిసిందే.అయితే ఎమ్మెల్యే వినతిని ఈడీ తిరస్కరించింది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు