వైసీపీలో రోజా హవా తగ్గినట్టేనా కారణం ఇదేనా ?  

Mla Rk Roja Back In Ycp Party-assembly,chairmen,chandrababu Naidu,jagan Mohan Reddy,rk Roja,tdp,ycp

ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్ర వేయించుకున్న వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రస్తుతం సైలెంట్ గా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ మీద కానీ , అధినేత జగన్ మీద కానీ ఏవైనా విమర్శలు వస్తే మీడియా ముందు గొంతెత్తి పోరాడేవారు. రోజా దూకుడుకు అప్పట్లో అధికార పక్షం తెలుగుదేశం కూడా భయపడేది..

వైసీపీలో రోజా హవా తగ్గినట్టేనా కారణం ఇదేనా ? -Mla Rk Roja Back In Ycp Party

అంతగా ఆమె రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉండేది. ఇక అసెంబ్లీ లో అయితే ఆమె వాగ్ధాటిని తట్టుకోవడం టీడీపీకి తలనొప్పిగా ఉండేది. అందుకే అసెంబ్లీ నుంచి ఆమెను చంద్రబాబు ఏడాది పాటు సస్పెండ్ చేయించారనే ప్రచారం కూడా నడిచింది.

అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది. ఇక ఆమెకు అడ్డు అదుపు ఉండదని ప్రతిపక్ష టీడీపీని ఆమె ఒక ఆట ఆదుకుంటారని అంతా భావించారు. అయితే ఆమె మాత్రం అనూహ్యంగా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశం అవుతోంది.

జగన్ పరిపాలన పై టీడీపీ అసెంబ్లీ లో చెలరేగిపోతోంది. అయినా ఆర్.కె. రోజా సౌండే ఎక్కడా వినిపించడం లేదు, కనిపించడంలేదు.

ఇంతకీ రోజా ఎక్కడున్నారు అంటే జబర్దస్త్ షో కి జడ్జిగా వ్యవహరిస్తూ కనిపిస్తున్నారు తప్ప మీడియా ముందు కనిపించడంలేదు. కొద్దీ రోజుల క్రితం ఆమెకు ఏపీ ఏఐసీసీ చైర్మన్ పదవి దక్కినా ఆమె ఎక్కడా నోరెత్తడంలేదు. వాస్తవానికి ఆర్..

కె. రోజా ఈసారి గెలిస్తే మంత్రి అవుతారని అంతా భావించారు. ఆమె మాత్రమే కాదు, మొత్తం ఏపీలో మెజారిటీ జనం కూడా భావించారు.

ఆర్.కె. రోజాకు ఫలానా శాఖ అని సోషల్ మీడియా కూడా ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది.

ఆమెకు ఆ పదవి దక్కకపోవడంతో తమ ప్రభుత్వం తొలి మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికే ఆమె డుమ్మా కొట్టారు.

ఈ వ్యవహారాలన్నీ జగన్ వరకు వెళ్లడంతో జగన్ పిలిచి మాట్లాడారని, అంతా సర్దుకుందని పార్టీ తరపున కొంతమంది నాయకులూ ప్రచారం చేసినా ఆమె మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. అంటే ఆమె ఇప్పటికీ అలకపానుపు దిగలేదన్న మాట. తనకు మంత్రి పదవే కావాలని ఆర్.

కె. రోజా ఈ విధంగా తన నిరసనను తెలియజేస్తున్నారేమో అన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. అయితే ఆమెను మంత్రిని చేస్తే తట్టుకోవడం కష్టమన్నఒకే ఒక్క కారణంతో జగన్ ఆమెను పక్కనపెట్టారనే ప్రచారమూ లేకపోలేదు..

ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడానికి జబర్దస్త్ షో కూడా ఒక కారణమని పార్టీలో టాక్ నడుస్తోంది.