12 ఏళ్ల బాలికపై మాజీ ఎమ్మెల్యే అఘాయిత్యం..!  

MLA, rape, case, arrest - Telugu Arrest, Case, Mla, Rape

దేశంలో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్లదాకా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.రోజురోజుకూ కామాంధుల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి.

 Mla Rape Case

ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాల్సిన నాయకుడే పన్నెండేళ్ల బాలికని రేప్ చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టయ్యాడు.బాధితురాలు న్యాయస్థానంలో తనకు జరిగిన అన్యాయం చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సదరు మాజీ ప్రజాప్రతినిధిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.తాజాగా ఈ సంఘటన ఈ సంఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది.

12 ఏళ్ల బాలికపై మాజీ ఎమ్మెల్యే అఘాయిత్యం..-Telugu Political News-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తమిళనాడులోని మదురై జిల్లాలోని నాగర్‌కోయిల్ మాజీ ఎమ్మెల్యే నంజిల్ ఏ మురుగేశన్ అత్యాచారం కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.అయితే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేతో పాటు, మరి కొంతమంది బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.అయితే బాధితురాలు జరిగిన సంఘటన గురించి పోలీసులకు తెలియజేయగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

నిందుతుడు పోలీసుల నుండి తప్పించుకునేందుకు మురుగేశన్‌‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.అయితే పోలీసులు ట్రేస్ చేసి అతనిని తిరునల్వేలి జిల్లా తిసాయన్‌విలైలో అరెస్టు చేశారు.ఆయన పోలీసుల కళ్లుగప్పి జిల్లా బోర్డర్ దాటి పక్క జిల్లాలోకి వెళ్లినట్లు సమాచారం.

#MLA #Rape #Case #Arrest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mla Rape Case Related Telugu News,Photos/Pics,Images..