అయ్యో ! జనసేన ఎమ్మెల్యే పరిస్థితి ఇలా ఉందా ? 

చక్కగా అధికార పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నాను అనే సంతోషం, ఏపీ సీఎం జగన్ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు అనే ఆనందం  ఒకపక్క జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లో ఉండగా, మరో పక్క మాత్రం అటు జనసేన ఇటు వైసిపి నియోజకవర్గ శ్రేణులకు దగ్గర కాలేకపోతున్నాను అనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ తరువాత కొద్ది కాలానికి జనసేన పై అసంతృప్తితో వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు.

 Mla Rapaka Varaprasad, Janasena, Razole Mla, Jagan, Ap Cm, Pavan Kalyan, Bonthu-TeluguStop.com

పార్టీకి రాజీనామా చేయకపోవడంతో అధికారికంగా జనసేన ఎమ్మెల్యే గానే ఆయన ఉన్నారు.

Telugu Ammaji, Ap Cm, Jagan, Janasena, Mlarapaka, Pavan Kalyan, Razole Mla, Ysrc

దీంతో రాపాక పై జన సేన వర్గం గుర్రు గా ఉండడమే కాకుండా,  ఆయన పేరు చెబితేనే మండిపడే పరిస్థితి నెలకొంది.ఇది ఊహించిందే అయినా, అటు వైసిపి లోను ఇబ్బందికర పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా నియోజకవర్గ నాయకులు ఎవరూ తనను పట్టించుకోన్నట్లు వ్యవహరిస్తుండడంతో జనసేన వైసిపి మధ్య ఎటూ కాకుండా అయిపోయాను అనే బాధ కనిపిస్తోంది.

రాజోలు వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా బొంతు రాజేశ్వరరావు హవా ఎక్కువగా కనిపించడంతో వైసిపి అధిష్టానం తో మాట్లాడి ఆయనకు చెక్ పెట్టించారు .ఇక ఆ తర్వాత తుని నియోజకవర్గానికి చెందిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ నియోజకవర్గ బాధ్యతలను చూస్తూ వచ్చారు.

Telugu Ammaji, Ap Cm, Jagan, Janasena, Mlarapaka, Pavan Kalyan, Razole Mla, Ysrc

అయితే ఆ కోఆర్డినేటర్ లతోనూ విభేదాలు పెట్టుకున్న రాపాక మళ్లీ వైసీపీ పెద్దల వద్ద పంచాయతీ పెట్టడంతో అమ్మాజీ ని సైలెంట్ చేశారు.ప్రస్తుతం రాజోలు వైసీపీ కి అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.కొద్ది నెలల క్రితం ఏపీ సీఎం జగన్ సమక్షంలో రాపాక వరప్రసాద్ తన కుమారుడిని వైసీపీలో చేర్పించారు.కానీ వైసిపి కార్యకర్తలు ఎవరు తనను పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరించడంతో , నియోజకవర్గంపై ఆయన పట్టు సంపాదించలేకపోతున్నారు.

నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమం తలపెట్టినా,  వైసిపి కార్యకర్తలు, నాయకులు పెద్దగా హాజరు కాకపోవడంతో ఇప్పుడు అధికారిక కార్యక్రమాలకే పరిమితం అయ్యారు.దీంతో అటు జనసేన,  ఇటు వైసిపి మధ్య రాపాక ఇబ్బందులు పడుతున్నారు.

ఇలా అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ రావడం కష్టమేనని, వచ్చినా గెలుపు మరింత క్లిష్టంగా మారుతుంది అనే భయం రాపాకలో రోజురోజుకు పెరిగిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube