సంకీర్ణానికి ఊరట, రాజీనామా వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి  

Mla Ramalinga Reddy Withdraw His Resignation-

రాజీనామాను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి.కర్ణాటక సర్కార్ లో గత కొద్దీ రోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.ఒకపక్క రెబల్ ఎమ్మెల్యేలు సీఎంగా కుమార స్వామి పనికిరారని విసిగిపోయిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు లేఖలను స్పీకర్ కు అందించారు కూడా.

Mla Ramalinga Reddy Withdraw His Resignation- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Mla Ramalinga Reddy Withdraw His Resignation--MLA Ramalinga Reddy Withdraw His Resignation-

అయితే మరోపక్క బలపరీక్ష కు సిద్ధంగా ఉన్నాము అంటూ సంకీర్ణ ప్రభుత్వం కూడా ప్రకటించడం తో ఈ రోజు విధాన సభలో బలపరీక్ష జరగనుంది.

Mla Ramalinga Reddy Withdraw His Resignation- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Mla Ramalinga Reddy Withdraw His Resignation--MLA Ramalinga Reddy Withdraw His Resignation-

అయితే మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు రెబల్ ఎమ్మెల్యేలు గా మారగా, కుమార స్వామి ఏ ధైర్యం తో బలపరీక్ష కు సిద్ధమయ్యారు అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది.

ఖచ్చితంగా ఆ 16 మంది ఎమ్మెల్యేలు కుమార స్వామికి అనుకూలంగా బలపరీక్షలో ఓటు వేయరు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం కూలే అవకాశం ఉంది.ఇదంతా తెలిసికూడా కుమార స్వామి ఈ బలపరీక్ష కు సిద్దమవ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.అయితే మరోపక్క కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే రామలింగా రెడ్డి తన రాజీనామా ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా మరో ఇద్దరు కూడా ఇదే బాటలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొద్దీ రోజులుగా సంకీర్ణ ప్రభుత్వం కి కనీసం కనిపించకుండా తప్పుకుంటూ తమ రాజీనామాలను ఆమోదించాలని కోరుతున్న నేతలు ఇటీవల సుప్రీం తీర్పు తో సైలెంట్ అయ్యారు.ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో పూర్తి నిర్ణయం స్పీకర్ కే చెందుతుంది అని సుప్రీం తీర్పు వెల్లడించడం తో సంకీర్ణ ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది.

ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు గనుక రాజీనామా లు వెనక్కి తీసుకుంటే సంకీర్ణ ప్రభుత్వానికి మరింత ఊరట లభించనుంది.మరో కొద్దీ సేపటిలో జరగబోయే ఈ బలపరీక్ష సమయంలో ఇంకెలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొనింది.