బుల్డోజర్ రాజకీయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఇక టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది.

 Mla Rajasinghe Key Remarks On Bulldozer Politics Telangana Politics, Mla Rajasi-TeluguStop.com

ఇప్పటికే చాలా వరకు ఇతర పార్టీల కీలక నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తూ పార్టీని మరింత పటిష్టపరిచేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.అయితే నేడు ఇందిరాపార్క్ లో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి.

కేసీఆర్ అవినీతిని బుల్డోజర్ లతో తొక్కిస్తామని, బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారని బుల్డోజర్ లాంటి నేతలతో తిరిగి తెలంగాణకు వస్తారని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి.అంతేకాక కార్యకర్తల ఆశీర్వాదంతో తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని కార్యకర్తలు ఇక మరింతగా పోరాడాలని వారు తెలిపారు.

అయితే రాజాసింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఇక బుల్డోజర్ లాంటి వ్యూహంతో ఇక కెసీఆర్ పై కంటూ కొన్ని ప్రత్యేక విమర్శలు సృష్టించి వచ్చే ఎన్నికల్లో అవే ఎక్కువగా ప్రజల్లో నానేలా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది.అయితే కెసీఆర్ ఈ బుల్డోజర్ విమర్శలపై ఇంకా స్పందించకున్నా ఎన్నికల సమయంలో చాలా వ్యూహాత్మకంగా కదిలే అవకాశం కనిపిస్తోంది.

Telugu @cm_kcr, Amith Sha, Bandi Sanjay, Bjpmlarajasingh, Delhi, Modi, Telangana

ఏది ఏమైనా రాజాసింగ్ విమర్శలు ఒకింత చర్చనీయాంశంగా మారినాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ తన శక్తికి మించి తెలంగాణలో అధికారం చేపట్టడానికి ప్రయత్నించడమే కాకుండా ఒకింత మునుపెన్నడూ తెలంగాణలో లేనంతగా ఎన్నికల సమయంలో వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇంతటి కఠిన పరిస్థితుల్లో కెసీఆర్ ఎంత మేర తన వ్యూహాలను విజయవంతంగా ప్రయోగిస్తాడనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube