టిప్పు సుల్తాన్ చిచ్చు : ప్రమాణాల సవాల్ తో కాణిపాకం లో  టెన్షన్ ?

గత కొద్ది రోజులుగా వైసిపి టిడిపి మధ్య అనేక విషయాల్లో వివాదం చెలరేగుతూనే ఉంది.రాష్ట్రం కేంద్రం మధ్య వివాదం ముదురుతోంది.

 Mla Rachamallu Siv Aprasad Reddy Vs Vishnuvardan Reddy War In Kanipakam Tippu Su-TeluguStop.com

ఇక ఏపీ బీజేపీ నాయకులు వైసీపీ ని పూర్తిగా టార్గెట్ చేసుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతూ వస్తోంది.ఇది ఇలా ఉండగానే, జగన్ సొంత జిల్లా కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రయత్నించడంతో బిజెపి ఈ వ్యవహారం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.

కొద్ది రోజుల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా విగ్రహ ఏర్పాటు చేయదలచిన ప్రాంతంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.ఇక బిజెపి ఏపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.

ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు పెరిగిపోవడంతో వివాదం మరింత ముదిరింది.విష్ణువర్ధన్ రెడ్డిపై శివ ప్రసాద్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేయడంతో, దీనిపై ఘాటుగా స్పందించారు.

శివ ప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవసరం అయితే దీనిపై కాణిపాకంలో సత్య ప్రమాణానికి తాను సిద్ధమంటూ విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు.తన ప్రమాణానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రావాలంటూ డిమాండ్ చేశారు.

Telugu Kadapa, Kanipakam, Prodduturu, Tippu Sulthan, Ysrcpmla-Telugu Political N

అయితే విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ కు శివ ప్రసాద్ రెడ్డి స్పందించలేదు.ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే కావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే టెన్షన్ లో పోలీసులు ముందుగానే అలెర్ట్ అయ్యారు.విష్ణువర్ధన్ రెడ్డి కాణిపాకం చేరుకునేందుకు సిద్దమవుతుండటంతో, కరోనా వైరస్ ప్రభావం తో ఆలయంలో సత్య ప్రమాణాలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.అయితే ఈ విషయాన్ని

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube