ఉప ముఖ్యమంత్రిగా అవకాశం సొంతం చేసుకున్న పుష్ప శ్రీ వాణి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తన క్యాబినెట్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.జగన్ క్యాబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖలని సామాజిక వర్గాల ప్రాతిపదికగా అందరికీ న్యాయం చేసేలా జగన్ కేటాయించారు.

 Mla Puspa Sri Vani Become Ap First Deputy Cm-TeluguStop.com

ఇక శనివారం జగన్ క్యాబినెట్ లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇదిలా ఉంటే ఈసారి ఎన్నడూ లేనివిధంగా ఉత్తరాంధ్ర నుంచి మహిళా ఎమ్మెల్యేకి క్యాబినెట్ లో కీలక మంత్రిత్వశాఖ ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది.

ఇంతవరకు ఏపీ క్యాబినెట్లో ఉత్తరాంధ్ర నుంచి ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రిగా చేసిన దాఖలాలు లేవు.ఇక తన క్యాబినెట్ లో వైఎస్ జగన్ ఎక్కువగా యువతకు ప్రాధాన్యత ఇచ్చి అందులో తన వెంట నడిచిన వారికి ఎక్కువగా అవకాశం ఇచ్చాడు.

ఇదిలా ఉంటే గిరిజన సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించే విధంగా విజయనగరం జిల్లా నుంచి కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి అవకాశం కల్పించారు.ఆమెను ఏకంగా ముఖ్యమంత్రి జగన్ ఉప ముఖ్యమంత్రిగా నియమించారు.

ఎస్సీ కోటాలో మహిళగా శ్రీవాణికి డిప్యూటీ సీఎం అవకాశం కల్పించారు.ఈ అవకాశం అందుకోవడం ద్వారా అతి చిన్న వయసులోనే మంత్రిగా అవకాశం దక్కించుకున్న మొదటి మహిళగా పుష్ప శ్రీవాణి రాజకీయాల్లో రికార్డు సృష్టించింది అని చెప్పాలి.

ఇక జగన్ తన కేబినెట్లో కీలకమైన హోం మినిస్టర్ పదవి కూడా మహిళ కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశాడు.దీంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఏపీలో మహిళా ఎమ్మెల్యేకు కీలకమైన హోంమినిస్టర్ పదవిని అందించిన ఘనత జగన్ కి దక్కింది అని చెప్పాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube