జనగామ జోరు: ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ.. మాటల యుద్ధమే..!!

జనగాం నీదా నా దా హై.అన్నట్టు తయారయింది జనగామ అసెంబ్లీ నియోజకవర్గం.

ఓవైపు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,(Muthireddy Yadagiri Reddy)మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy).ఒకే పార్టీ నుంచి ఇద్దరు నేతలు బాణాల్లా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.

దీంతో కార్యకర్తలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.ఏ నాయకుడి వెంబడి పోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు.

సస్పెన్స్ లో ఉన్నటువంటి జనగామ టికెట్ అక్కడి ప్రజల్లో కూడా కాస్త ఆసక్తిని పెంచింది.ఈ తరుణంలోనే జనగామలోని(Janagama) రాజకీయాలన్ని ఒక్కసారిగా హీట్ ఎక్కాయి.

Advertisement

ఓవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు.నాకే టికెట్ వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరోవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని విమర్శిస్తూ కేసీఆర్ ను(KCR) పొగిడేస్తున్నారు.ఈ తరుణంలోనే ముత్తిరెడ్డి, పల్లాపై మండిపడుతున్నారు.

బీఆర్ఎస్ లో(BRS) చేరిన ఇతర నేతల గురించి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం మనందరికీ తెలుసు.

ఈ వ్యాఖ్యలను స్పందిస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.వెంటనే క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.డబ్బులు ఎక్కువై బలుపుగా మాట్లాడుతున్నారని, అమాయక ప్రజలను అయోమయం చేస్తున్నారని తెలియజేశారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఇలాంటి నేతల వల్ల కేసీఆర్(KCR) సంకల్పానికి విఘాతం కలుగుతుందని ఆరోపించారు.

Advertisement

ఏ నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారని, ఆయన మాటను కాదనేది లేదని, ఆయనతో కలిసే ప్రయాణం చేస్తానని ముత్తిరెడ్డి అన్నారు.ప్రజల కోరికను కేసీఆర్ ఎప్పుడు కాదనరని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నాకు పూర్తిస్థాయి విశ్వాసం ఉందని, 14 ఏళ్ల కష్టాలు, జ్ఞాపకాలు కేసీఆర్ దృష్టిలో ఉన్నాయని తెలియజేశారు.ప్రజల కోరిక మేరకు సీఎం కేసీఆర్ సముచిత నిర్ణయం తీసుకుంటారని, ఆ నిర్ణయంతోనే నేను భారీ మెజారిటీతో గెలుస్తానని అన్నారు.

తాజా వార్తలు