తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి( BRS ) వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడగా తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి( MLA Kadiyam Srihari ) కూడా బీఆర్ఎస్ ను వీడనున్నారు.
ఈ మేరకు కడియం శ్రీహరి రేపు హస్తంగూటికి చేరనున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నివాసంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కడియం కావ్య( Kadiyam Kavya ) కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.కాగా రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పోటీ చేయనున్నారని తెలుస్తోంది.