అధికార గర్వం తో రెచ్చిపోయిన ఎమ్మెల్యే మున్సిపల్ ఉద్యోగి పై దాడి  

Mla Hit On Municipal Employee With Cricket Bat-

అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న ధైర్యం రాజకీయ నేతలో బాగా పేరుకుపోతుంది.కేంద్రం లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం లోకి వచ్చింది అన్న కారణమో మరేదో కారణమో తెలియదు కానీ బీజేపీ కి చెందిన ఒక ఎమ్మెల్యే రౌడీలా ప్రవర్తించిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Mla Hit On Municipal Employee With Cricket Bat--Mla Hit On Municipal Employee With Cricket Bat-

అధికారం ఉందన్న పొగరో ఏమో గానీ ఒక మున్సిపల్ ఉద్యోగిని క్రికెట్ బ్యాట్ తో చితక బాదాడు.ఇండోర్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.నగరంలో ఆక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకునేందుకు ఓ మునిసిపల్‌ ఉద్యోగి నగరంలో పర్యటించారు.

Mla Hit On Municipal Employee With Cricket Bat--Mla Hit On Municipal Employee With Cricket Bat-

అయితే ఇంతలో బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్‌ విజయ వర్గీయ అక్కడకి వచ్చి సదరు ఉద్యోగిపైకి దూసుకొచ్చారు.

ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే క్రికెట్‌ బ్యాట్‌తో ఆ ఉద్యోగిని ఇష్టమొచ్చినట్టు దాడి చేశారు.ఎందుకని ఎదురు ప్రశ్నించినందుకు అతడిపై మరింత రెచ్చిపోయి మరి దాడికి దిగడం గమనార్హం.

‘ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో నువ్వు వెళ్లిపో.లేదంటే ఏం జరిగినా నీదే బాధ్యత’ అంటూ హెచ్చరించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.అయితే ఈ విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పై ఎమ్మెల్యే దారుణంగా బ్యాట్ తో దాడి చేయడం పై నెటిజన్లు మండిపడుతున్నారు.