ఆ డిమాండ్ ఈ యువ ఎమ్మెల్యేని మంత్రి చేస్తుందా ?

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.ఇప్పుడు జగన్ తన క్యాబినెట్ లో ఉన్న మూడు వంతుల మందిని తప్పించి ఆ స్థానంలో కొత్త వారిని మంత్రులుగా ఎంపిక చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

 Ycp Mla Gudivada Amarnath Hoping For Minister Post,  Jagan, Ysrcp, Ap, Ap Govern-TeluguStop.com

ఇటీవల సిమ్లా వెళ్లిన జగన్ అక్కడ దీనిపైనే కసరత్తు చేసినట్లు ప్రచారం జరిగింది.మరో రెండు ఈ నెలలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవెరెవర్ని ఎవరిని తప్పించాలి ? ఎవరికి కొత్తగా అవకాశం కల్పించాలి అనే విషయంపై జగన్ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు.అదే సమయంలో వీర విధేయులతో తో పాటు, సామాజిక వర్గాల సమతూకం పాటించే విధంగా జగన్ చాలా జాగ్రత్తలు తీసుకుంతున్నారు.

అయితే మంత్రి మండలి ఎంపిక విషయంలో జగన్ పూర్తిగా ఒక క్లారిటీ తో ఉన్నారు.

తమకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ చాలామంది సన్నిహిత ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తున్నా, జగన్ మాత్రం తన ఫార్ములాను మాత్రమే ఉపయోగించాలని, ఎటువంటి ఒత్తిడులకు గురికాకూడదు అని నిర్ణయం తీసుకున్నారు.

అసలు జగన్ తన మాట తప్ప ఎవరి మాట వినే రకం కాదని, వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు బాగా తెలుసు.జగన్ ఏం చేసినా మద్దతుగా నిలవడం తప్పించి, ఎవరూ నోరెత్తే సాహసం చేయరు.

అయితే కొంతమంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు మాత్రం జగన్ పై పరోక్షంగా ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ముఖ్యంగా విశాఖ జిల్లాలో కీలకంగా ఉన్న యువ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మంత్రి కాబోతున్నారని చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది.

Telugu Ap, Ap Ministers, Jagan, Jagan Simla, Kapu Nadu, Vizag Mla, Ysrcp-Politic

జగన్ తో పాటు , విజయసాయి రెడ్డి వంటి వారికి అత్యంత సన్నిహితుడిగా అమర్నాథ్ ముద్ర వేయించుకున్నారు.మంత్రి వర్గ విస్తరణ జగన్ చేపడితే, తప్పకుండా అమర్నాథ్ కు కీలకమైన మంత్రిత్వశాఖ దక్కుతుంది.సరిగ్గా ఇదే సమయంలో అమర్ నాథ్ కు మంత్రి పదవి ఇవ్వాలని కాపునాడు నేతలు మీడియా సమావేశం నిర్వహించి మరీ డిమాండ్ చేశారు.ఇప్పటికే విశాఖ లో అవంతి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు.

ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత , అలాగే మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన నేత.కానీ వీరు మాత్రం గుడివాడ అమర్నాథ్ నే మంత్రి చేయాలంటూ కాపునాడు నేతలు డిమాండ్ చేస్తున్న తీరు కలిసి వస్తుందా లేక మొదటికే మోసం వస్తుందా అనేది తేలాల్సి ఉంది.ఎందుకంటే జగన్ ఈ తరహా డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే పరిస్థితి లేదు.మరి అమర్నాథ్ విషయంలో జగన్ ని ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube