ఆ విషయంలో ఒంటరైన ఎమ్మెల్యే ఈటెల...అందుకే త్వరలో కీలక నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే ఈటెల వ్యవహారం రాజకీయ ప్రకకంపనలు సృష్టిస్తోంది.తమ భూమిని కబ్జా చేసాడని కొంత మంది రైతులు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన సీఎం కేసీఆర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

 Mla Etela Rajender Has Become Alone In That Regard And Ready With Key Decision-TeluguStop.com

అయితే ఆ తరువాత మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేటకు వెళ్లి క్షేత్ర స్థాయిలో కలెక్టర్, తహసీల్దార్ వెళ్లి విచారణ చేయడం జరిగింది.అయితే ఈటెల అసైన్డ్ భూమిని కబ్జా చేసారని మెదక్ కలెక్టర్ హరీష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

 Mla Etela Rajender Has Become Alone In That Regard And Ready With Key Decision-ఆ విషయంలో ఒంటరైన ఎమ్మెల్యే ఈటెల…అందుకే త్వరలో కీలక నిర్ణయం-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మరి ఈ నివేదికను ఆధారంగా చేసుకొని ఈటెలను కేసీఆర్ భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈటెల తప్పు చేశాడా లేదా అనేది ఒక విషయమైతే ఈటెల ను బాగా బాధ పెట్టిన అంశం గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ లోని తన తోటి సహచరులు ఎవరూ తనకు బాసటగా నిలబడకపోవడం, కనీసం మాట వరుస కైనా అసలు ఏమి జరిగింది అని అడిగే ప్రయత్నం చేయకపోవడం, ఈటెల ను ఒంటరిని చేయడంతో ఈటెలను బాగా బాధించినట్టు తన సన్నిహితులు చెబుతున్న మాట.ఇక అందుకే ఈటెల కూడా టీఆర్ఎస్ అవినీతి చిట్టా విప్పుతానని, లెఫ్ట్ ఉద్యమాలలో పనిచేసి వచ్చిన వాడిని నాకు పోరాటాలు కొత్త కాదని, టీఆర్ఎస్ లో ఉన్న అందరి జాతకాలు విప్పుతానని సంచలన వ్యాఖ్యలు చేసారు.మరి ఈటెల ఏమి బయటపెడతారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

#CM KCR #EtelaIllegal #MinsiterEtela #Etela Next Move #Eetela Rajendar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు