రాజధానిపై రచ్చ: లోక కల్యాణమా లోకేష్ కళ్యాణమా ?

ఏపీ రాజధాని అమరావతి వ్యవహారంపై అసెంబ్లీ లో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్రమైన చర్చకు దారి తీసింది.రాజధాని నిర్మాణంపై ఒక అవగాహన లేకుండా అస్తవ్యస్త విధానాలతో చంద్రబాబు ప్రజలను మోసం చేసారంటూ వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సభలో ప్రసంగించారు.

 Mla Darmana Prasadarao Sensational Comments On Ap Capital Amaravathi-TeluguStop.com

రాజధానిపై తీసుకునే కీలక నిర్ణయాలు రాజ్యాంగ పరిధిలో ఉండాలంటూ చంద్రబాబు నుద్దేశించి అన్నారు.అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని, టీడీపీ హయాంలో చేపట్టిన అమరావతిపై అన్ని ప్రాంతాల్లో అసంతృప్తులు ఉన్నాయని ధర్మాన తెలిపారు.

ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కనీస అభిప్రాయాలు తీసుకోకుండానే ముందుకు వెళ్లారని మండిపడ్డారు.

రాజధానిలో ఎక్కడ ఏ ఆఫీసు ఉందో కూడా తెలియదు.

రాజధాని అభిప్రాయం చెప్పాలని శివరామకృష్ణ కమిటీ వేశారు.కానీ, ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు కూడా చంద్రబాబు ఆగలేకపోయారు.

బాబు ఎందుకు అలా చేశారో సమాధానం చెప్పాలంటూ ధర్మాన నిలదీశారు.రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు పది ఎకరాలకు మించి భూమి అందుబాటులో లేదని చెప్పారు.

గత ఐదు సంవత్సరాల్లో కేంద్రం 23 విద్యా సంస్థలను ఇస్తే శ్రీకాకుళంలో ఒక్క సంస్థ కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.రాజధాని లోక కల్యాణం కోసమా ? లేక లోకేష్‌ కల్యాణం కోసమా ? అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.చంద్రబాబు ప్రభుత్వానికి అధికార తీసుకువచ్చిన శ్రీకాకుళం జిల్లాకు బాబు బాగా అన్యాయం చేసారంటూ ధర్మాన మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube