ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటీమణులు రోజా ఒకరు.ఈమె గతంలో వెండితెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా తనదైన శైలిలో రాజకీయాలలో కూడా దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా రోజా కూతురు అన్షు మాలిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత కొద్ది రోజుల క్రితం అన్షు ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ పై ఫోటో పడటంతో ఇంత చిన్న వయసులోనే ఈ స్థాయికి ఎదగడంతో పలువురు ఈమె పై ప్రశంసలు కురిపించారు.
ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రోజా నిత్యం తనకు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా మంది అభిమానులు అన్షు హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఎప్పుడు అంటూ ప్రశ్నలు వేసేవారు.అయితే ప్రస్తుతం ఆ సమయం వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి సిని వర్గాలు.
రోజా కూతురు అన్షు హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఇవ్వడానికి అన్ని సిద్ధమైనట్లు సమాచారం.ఈమె హీరోయిన్ గా ఒక స్టార్ హీరో వారసుడు సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈమె హీరోయిన్ గా తన తల్లి మాదిరి తెలుగుతెరపైకి వస్తుందా.లేకపోతే తన తండ్రి సెల్వమని మాదిరి తమిళంలోకి ఎంట్రీ ఇస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.
అయితే ఇప్పటికే ఈమె యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పదిహేడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి అన్షు హీరోయిన్ గా గ్రాండ్ గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.అయితే రోజా కూడా 17 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.మరి అన్షు కూడా రోజా మాదిరి స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.
అయితే ఈమె నటించబోయే సినిమాకు సంబంధించిన విషయాలన్నింటినీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.