పరువు తీస్తున్న పీఏలు ... బాలయ్య ఇదేందయ్యా ..?  

Mla Balakrishna Pa Viraiya Behaving Like He Is The Mla-

ఎప్పుడూ ఏదో ఒక వివాదం లో చిక్కుకోవడం ప్రజల్లో పలుచనవ్వడం నందమూరి బాలకృష్ణకు అలవాటయిపోయింది. బాలయ్య అభిమానులు కొట్టడం… తన నోటి దురద తో ఏదో ఒకటి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ఇలా ఏదో ఒక విషయంలో బాలయ్య అభాసుపాలు అవుతూనే ఉన్నాడు . తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో ప్రస్తుతం టిడిపి నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది దీనికి కారణం ఆయన పీఏ లే అని తెలుస్తోంది..

పరువు తీస్తున్న పీఏలు ... బాలయ్య ఇదేందయ్యా ..? -MLA Balakrishna PA Viraiya Behaving Like He Is The MLA

బాలకృష్ణ సినిమాల కారణంగా నియోజకవర్గ ని ప్రజలకు అందుబాటులో ఉండక పోవడం వలన పీఏలతోనే రాజకీయం నడిపిస్తున్నారు . అయితే ఇదే అదనుగా భావించిన వారు తామే ఎమ్మెల్యేలు అన్నట్టుగా నియోజకవర్గంలో పెత్తనం చేస్తూ… స్థానిక నాయకులను, టీడీపీ అభిమానులను వేదిస్తున్నారట. గతంలో పిఎగా పనిచేసిన ‘శేఖర్‌’ బాలకృష్ణ పరువు ప్రతిష్టలను మంటగలపడంతో. ఆయన్ను తొలగించి.’కృష్ణమూర్తి’ అనే ఉద్యోగిని పేయీగా నియమించుకున్నాడు బాలయ్య. ఆయన మండల స్థాయి నాయకుల వద్దకు స్వయంగా వెళ్లి వారితో వివరాలను తెలుసుకుంటూ…గతంలో జరిగిన నష్టాన్ని పూడ్చడమే కాకుండా వ్యతిరేకతను చాలా వరకు తగ్గించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా… ఇంతలోనే…వీరయ్య అనే వ్యక్తిని కూడా పీఏగా పెట్టాడు బాలయ్య. ఎప్పుడైతే.

కృష్ణమూర్తి హిందూపూర్‌ నుంచి బయటకు వెళ్లారో అప్పటి నుంచి వీరయ్య ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని నియోజకవర్గ నాయకులు వాపోతున్నారు. స్థానిక నాయకులు ఏదైనా పని మీద అధికారులను కలిస్తే వీరయ్య చెబితేనే చేస్తాం లేకపోతే చెయ్యం అంటూ ఖరాఖండీగా చెప్పేస్తున్నారట.

అంతే కాకుండా ఆయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. వీరయ్య అవినీతిని కట్టడి చేయకపోతే నియోజకవర్గంలో టీడీపీ దెబ్బతినడం ఖాయం అని స్థానిక నాయకులు వాపోతున్నారు. అంతే కాదు వీరయ్య వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేష్‌కు ఫిర్యాదు చేసేందుకు కూడా వారు సిద్ధం అవుతున్నారు.