వ్యాపారవేత్తని పెళ్లాడనున్న సునీల్ హీరోయిన్  

Miya George Engaged To Ashwin - Telugu Celebrity Marriages, Kollywood,, South Cinema, South Heroins, Tollywood

ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి వరుసగా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే తెలుగు స్టార్స్ రానా, నితిన్, నిఖిల్ ఒక ఇంటి వారు అవుతున్నారు.

 Miya George Engaged To Ashwin

ఇక స్టార్ హీరోయిన్ నయనతార కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది.ఇక ఇదే బాటలో చాలా మంది సెలబ్రిటీలు నడుస్తున్నారు.

వారిలో మలయాళీ ముద్దుగుమ్మ మియా జార్జ్ కూడా ఉంది.తెలుగులో ఉంగరాల రాంబాబు సినిమాలో సునీల్ కి జోడీగా ఈ భామ నటించింది.

వ్యాపారవేత్తని పెళ్లాడనున్న సునీల్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

అయితే మలయాళీలో స్టార్ హీరోయిన్ గా మియాజార్జ్ కి మంచి గుర్తింపు ఉంది.అక్కడ చాలా మంది స్టార్స్ తో రొమాన్స్ చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమాలో ఓ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ అమ్మడుకి వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌తో నిశ్చితార్థం జరిగింది.కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో కేరళలోని ఫిలిప్ నివాసంలో మియా, ఫిలిప్ ఉంగరాలు మార్చుకున్నారు.మియా ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ ఫిలిప్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది.వీరిద్దరి వివాహం ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్నట్టు సమాచారం.

టీవీ నటిగా కెరియర్ ప్రారంభించిన మియా ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.పెళ్లి తర్వాత సినిమా కెరియర్ కి ఈ అమ్మడు స్వస్తి చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test