అమ్మాయిలకి నా కథ స్ఫూర్తి కావాలి... మిథాలీ రాజ్

భారత మహిళ క్రికెట్‌ జట్టు సారధ మిథాలీ రాజ్‌ జీవిత చరిత్రని వెండితెర మీద ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.బాలీవుడ్ లో రాహుల్‌ ధోలాకియా దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిథాలీ పాత్రని తాప్సీ చేస్తుంది.

 Mithali Raj Rahul Dholakia Tapsi Pannu-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ అంచనాలు పెండుతుంది.ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత తాప్సీ తన పంథా పూర్తిగా మార్చుకొని కంటెంట్ బేస్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది.

కంగనా తర్వాత ఇప్పుడు కంటెంట్ బేస్ సినిమాలు అంటే ముందుగా తాప్సీ పేరు వినిపిస్తుంది.ఇక మిథాలీ బయోపిక్ ని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే లేక్మీ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న మిథాలీ రాజ్ తన బయోపిక్ తో వస్తున్న సినిమా మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నా జీవిత కథ వెండితెరపై ఆవిష్కరిస్తుండడం చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమా ద్వారా మహిళా క్రికెటర్‌ కష్టాలు ప్రపంచానికి తెలుస్తాయి.90వ దశకంలో క్రికెట్‌ ప్రారంభించినప్పుడు దేశంలో మహిళా క్రికెటర్‌ ఎంతలా శ్రమించాల్సి వస్తుందన్న విషయం తెలుస్తుంది.చాలా మంది అమ్మాయిలు క్రికెట్‌లో రాణించాలని ఉన్నా భవిష్యత్తు ఉండదని భయపడుతున్నారని అలాంటి వారికి ఈ సినిమా స్ఫూర్తివంతంగా నిలుస్తుంది.చాలా మంది అమ్మాయిలు క్రికెట్‌ ఆడాలనుకుంటున్నారు కానీ, వాళ్లను, వాళ్ల క్రీడలను టీవీల్లో చూడకూడదని భావిస్తున్నారు.

అందుకే వాళ్లు క్రికెట్‌కు దూరమవుతున్నారు.ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలు లభించినప్పుడే వారి కల నెరవేరుతుంది.

నా కథను చెప్పేందుకు తాప్సీని ఎంపిక బెస్ట్ ఛాయస్ అని పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube