చేసిన త‌ప్పులే మ‌ళ్లీ మ‌ళ్లీ.. ప‌వ‌న్‌ను ఆడుకుంటున్నారుగా...!

రాజ‌కీయాల్లో అయినా.సాధార‌ణ జీవితంలో అయినా.నాయ‌కులు త‌ప్పులు చేయ‌డం కామ‌నే.అయితే, చేసిన త‌ప్పుల నుంచి ఎవ‌రైనా పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు.మున్ముందు అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకుంటారు.అయితే.

 Mistakes Made Again And Again Pawan Playing Political Games,ap,ap Political News-TeluguStop.com

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం చేసిన త‌ప్పులే ప‌దే ప‌దే చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు తెలిపిన ప‌వ‌న్‌.

అప్ప‌టి ప్ర‌భుత్వంలో జ‌రిగిన త‌ప్పుల‌పై నోరు విప్పేందుకు సాహ‌సించ‌లేదు.ఉదాహ‌ర‌ణ‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తుందుర్రు ఆక్వాఫ్యాక్ట‌రీ వ‌ల్ల త‌మ భూములు నాశ‌నం అవుతున్నాయ‌ని రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు.

అయితే.అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైతుల‌ను అణిచివేసింద‌నే విష‌యం తెలిసిందే.ఆ స‌మ‌యం లో చాలా మందితుందుర్రు వాసులు హైద‌రాబాద్ వెళ్లిమ‌రీ ప‌వ‌న్‌కు త‌న బాధ‌లు చెప్పుకొన్నారు.అయి తే.ఆ విష‌యంలో మౌనంగా ఉన్న పవ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లే ఎదుర్కొన్నారు.ఇక‌, అలా ఉండ‌డం త‌ప్ప‌ని.

త‌ర్వాత రోజుల్లో ప్ర‌క‌టించారు.అంతేకాదు.

చంద్ర‌బాబు స‌ర్కారుపై వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని తెలిసిన వెంట‌నే రంగంలోకి దిగిపోయిన ప‌వ‌న్‌. జ‌గ‌న్‌పై అప్ప‌ట్లో విమర్శ‌లు చేయ‌డం ద్వారా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని యూట‌ర్న్ తిప్పే ప్ర‌య‌త్నం చేశారు.

Telugu Ap, Janasainiks, Janasena, Latest, Pawan Kalyan, Game, Ysrcp-Telugu Polit

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న స‌మ‌యంలో మ‌ళ్లీ ఇప్పుడు ఇలాంటి యూట‌ర్న్ పాలిటిక్సే చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.మ‌రోవైపు.ప‌వ‌న్ వ్య‌వ‌హార‌శైలిపైనెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.గ‌తంలో ఇలా చేసే క‌దా.ప‌వ‌న్ సార్‌. ఎన్నిక‌ల్లో ఓడిపోయారు.

పోనీ.ఇప్ప‌టికైనా పుంజుకోండి.

ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో.వాటికి ప్రాధాన్యం ఇవ్వండి.

సినిమా డైలాగులు త‌గ్గించండి.అని సూచ‌న‌లు చేస్తున్నారు.

గ‌తంలోనూ తాట తీస్తాం.రోడ్డుపై నిల‌బెడ‌తాం.

అంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

అయితే.

ఆ డైలాగులు విని ఆనందించేందుకు అభిమానులు చ‌ప్ప‌ట్లు కొట్టేందుకు మాత్రమే ప‌రిమిత‌మ‌య్యాయ‌ని.ఎలాంటి ఓట్లు రాల‌లేద‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తున్నారు.

క‌నీసం.ఆయా పాఠాల నుంచైనా.

ప‌వ‌న్ పాఠాలు నేర్చుకుని ఫ్యూచ‌ర్‌లో అయినా.రాజ‌కీయ నేత‌గా ఎదిగేలా ఉండాల‌ని చెబుతున్నారు.

మ‌రి వ‌కీల్ సాబ్ వింటారా?  చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube