భార్య ప్రియుడుని చంపాలని అనుకున్నాడు... కాని అంతలో

వివాహేతర సంబంధాలు కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రమాదకరంగా మారాయి.కట్టుకున్న భార్య వేరొక వ్యక్తితో తిరుగుతుంది అంటే ఏ భార్తకైన కోపం వస్తుంది.

 Missouri Husband Pulls Gun On Runaway Wifes Lover In Brooklyn-TeluguStop.com

ఆ కోపంలో అయితే కట్టుకున్న భార్యని అయిన చంపేయాలని అనుకుంటాడు.లేదంటే ఆమెని తనకి కాకుండా చేసిన భార్య ప్రియుడుని అయిన చంపాలని అనుకుంటాడు.

అమెరికాలో కూడా ఓ భర్తకి అలాంటి కోపమే వచ్చింది.తన భార్యని తనకి కాకుండా చేసిన ఆమె ప్రియుడుని చంపాలని అనుకున్నాడు.

అయితే ప్లాన్ అమలు చేసిన, సిచువేషన్ బెడిసి కొట్టడంతో కటకటాల పాలయ్యాడు.

అమెరికాలోని మిస్సోరికి చెందిన ఓ వ్యక్తిని భార్య అతనిని మోసం చేసి ప్రియుడితో పారిపోయింది.

భార్య కోసం గాలించిన భర్తకు ఆమె బ్రూక్లిన్‌లో ప్రియుడితో కలిసి ఉంటున్నట్లు సమాచారం అందింది.దాంతో తన భార్యను తీసుకెళ్లిన ప్రియుడిని చంపేయాలని నిర్ణయించుకున్న అతను తన దగ్గర ఉన్న తుపాకీతో వారు ఉంటున్న చోటుకు వెళ్లాడు.

అక్కడ భార్య ప్రియుడితో కలిసి ఉండడం చూసి అతనిపై తుపాకీ గురిపెట్టి కాల్చి చంపబోయాడు.అదే సమయంలో తుపాకీ ట్రిగ్గర్ జామ్ కావడంతో అది పని చేయలేదు.

దీంతో తుపాకీ ఎదురుగా ఉన్న భార్య ప్రియుడు క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు.ఆ ఘటన తరువాత భర్త అక్కడి నుంచి వెళ్లిపోగానే భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.అతని మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన జైల్లో పెట్టాడు.అయితే తప్పు చేసింది తన భార్య, ఆమె ప్రియుడు అయిన చంపాలని ప్రయత్నం చేసినందుకు అతను అరెస్ట్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube