అమెరికాలో దారుణం…వెలుగు చూసిన మరో జాత్యహంకార హత్య…!!!  

Missouri Black Man Death - Telugu America, Black Man Murder Missouri, Blackman, George Floyd Murder

అమెరికాలో జాత్యహంకార హత్యలు పెట్రేగి పోతున్నాయి.ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా విదేశీయులపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి.

 Missouri Black Man Death

ఆ తరువాత ఈ సమస్య కొద్దిగా కుదుటపడినా అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వరుసగా విదేశీయులపై దాడులు పెరగడం ఎన్నో అనుమానాలకి తావిస్తోంది.కొన్ని రోజుల క్రితం నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత.మరో నల్ల జాతీయుడు బ్రూక్స్ హత్య జరగడంతో కావాలని కుట్ర కోణంలో నల్లజాతీయులపై దాడులు జరుగుతున్నాయని నిరసనలు తెలిపుతున్నారు.ఈ వరుస జాత్యహంకార హత్యలతో ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి.ప్రముఖ నాయకులు మాజీ అమెరికా అధ్యక్షులు సైతం ఈ హత్యలని ఖండించారు.

అమెరికాలో దారుణం…వెలుగు చూసిన మరో జాత్యహంకార హత్య…-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే తాజాగా మరో నల్లజాతీయుడు పాప్ సింగర్ హుయే హత్య ఘటన కలకలం రేపుతోంది.

మిస్సోరిలోని మార్టిన్ లూధర్ కింగ్ కాలనీలో హుయే ఉంటున్నాడు.

అతడు తన ఇంట్లో నుంచీ బయటకి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.అయితే అతడి సన్నిహితులు ఆసుపత్రికి అతడిని తరలించేలోగానే అతడు ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని స్థానిక పోలీసులు తెలిపారు.ఇదిలాఉంటే ఇది ముమ్మాటికి జాత్యహంకార హత్యేనని అంటున్నారు నల్లజాతీయులు.

ఓ నల్ల జాతీయుడి అవడంతో అతడి ఎదుగుదల చూడలేని కొందరు ఈ హత్యకి పాల్పడి ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test