రష్మికకి బాలీవుడ్ అవకాశం అందించిన డిజాస్టర్ మూవీ... రివీల్ చేసిన డైరెక్టర్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది.

 Mission Majnu Director Why Choose Rashmika Mandanna In Mission Majnu Movie, Toll-TeluguStop.com

వీటితో పాటు శంకర్, రామ్ చరణ్ సినిమా కోసం, అలాగే త్రివిక్రమ్, మహేష్ బాబు మూవీ కోసం సంప్రదిస్తున్నట్లు టాక్ వస్తుంది.తెలుగులో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో దూసుకుపోతుంటే సడెన్ గా బాలీవుడ్ లో మిషన్ మజ్ఞు సినిమాలో సిద్ధార్ద్ మల్హోత్రాకి జోడీగా అవకాశం పట్టేసింది.

దీని తర్వాత అమితాబచ్చన్ మనవరాలుగా గుడ్ బై అనే సినిమాలో స్టార్ట్ చేసింది.మరో సినిమా కూడా ఫైనల్ స్టేజ్ లో ఉందని తెలుస్తుంది.

బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకి ఒకే చెప్పిన సౌత్ ఇండియా బ్యూటీగా రష్మిక ఇమేజ్ మరింత పెరిగిపోయింది.అయితే మిషన్ మజ్ఞు మూవీలో రష్మికని ఎంపిక చేయడానికి గల కారణం దర్శకుడు శాంతను రివీల్ చేశాడు.

రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ సినిమా చూసి మిషన్ మజ్ఞు కోసం ఆమెని ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు.క్యారెక్టర్ ప్రకారం మొదటి నుంచి ఆమె అమాయక లుక్స్ తో పాత్రలో కనిపిస్తూనే ఒకానొక సందర్భంలో తనలోనే కంప్లీట్ వేరియేషన్స్ చూపించాలని, అలాగే గ్లామరస్ గా కనిపించాల్సి ఉంటుందని చెప్పాడు.

డియర్ కామ్రేడ్ సినిమా ఆమె క్యారెక్టరైజేషన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుందని, ఈ కారణంగా తన సినిమాకి రష్మిక పెర్ఫెక్ట్ అని భావించి ఆమెని ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు.తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ తో రాణిస్తూ బాలీవుడ్ అవకాశం ఆమె కెరియర్ లో డిజాస్టర్ మూవీగా నిలిచినా డియర్ కామ్రేడ్ తో రావడం నిజంగా ఆసక్తికరం అని చెప్పాలి.

డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో రష్మిక నటనకి మంచి ప్రశంసలు లభించాయి.స్క్రీన్ ప్లే లోపాలు కారణంగా ఆ సినిమా తెలుగు ప్రేక్షకులని మెప్పించలేకపోయిందని మాత్రం చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube