మిషన్ ఇంపాజిబుల్ 7 లో ప్రభాస్... స్పందించిన దర్శకుడు క్రిస్టోఫర్

హాలీవుడ్ యాక్షన్ అడ్వంచర్ మూవీ, ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా అభిమానులని కలిగి ఉన్న టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఏడో భాగం ప్రస్తుతం రెడీ అవుతుంది.అయితే ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటించినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది.

 Mission Impossible 7 Director Responds On Prabhas In His Movie, Director Christo-TeluguStop.com

దర్శకుడు క్రిస్టోఫర్ ఈ విషయాన్ని ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారని బి-టౌన్ లో టాక్ వచ్చింది.అది కాస్తా ట్రెండింగ్ న్యూస్ అయ్యింది.

రాధేశ్యామ్ షూటింగ్ ఇటలీలో జరుగుతున్న సమయంలోనే మిషన్ ఇంపాజిబుల్ షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొన్నాడని, ఈ మూవీ అతని పాత్రని సర్ప్రైజ్ గా రివీల్ చేసేందుకు బయటపెట్టలేదని టాక్ వినిపించింది.అయితే ఈ వార్తలపై డైరెక్ట్ గా మిషన్ ఇంపాజిబుల్ 7 దర్శకుడు క్రిస్టోఫర్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు.

ప్రభాస్ ఆ సినిమాలో నటించినట్లు జరుగుతున్న ప్రచారంపై ఒక ఇండియన్ అభిమాని ఏకంగా దర్శకుడుని సోషల్ మీడియాలో అడిగారు.
దానికి క్రిస్టోఫర్ కూడా చాలా ప్రొఫెషనల్ గా సమాధానం చెప్పి క్లారిటీ ఇవ్వడం విశేషం.

ప్రభాస్ చాలా గొప్ప నటుడు.అయితే అతన్ని ఇప్పటి వరకు మేము కలవలేదు అని చెప్పుకొచ్చారు.

దీంతో మిషన్ ఇంపాజిబుల్ 7లో ప్రభాస్ నటించడం లేదనే విషయాన్ని వారు క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.అయితే హాలీవుడ్ దర్శకుడి దృష్టిలో ప్రభాస్ టాలెంట్ పడింది అంటే కచ్చితంగా భవిష్యత్తులో ప్రభాస్ హాలీవుడ్ సినిమాలలో నటించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తుంది.

ఇప్పటికే అతని సినిమాలతో ఇండియన్ ఇంటర్నేషనల్ హీరోగా ప్రభాస్ ఎదిగిపోయాడు.నాగ్ అశ్విన్ మూవీ అయితే ఏకంగా ఇంగ్లీష్ బాషలో కూడా డైరెక్ట్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో ఇండియన్ హాలీవుడ్ హీరోగా ప్రభాస్ స్టామినా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది.

అప్పుడు కచ్చితంగా హాలీవుడ్ సినిమాల నుంచి కూడా అతనికి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని రెబల్ స్టార్ అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube