కనిపించకుండపోయిన స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్..?!

ఒలింపిక్స్‌ లో భారత్‌ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.ఉత్తర ఢిల్లీలోని ఛత్రాసాల్‌ స్టేడియంలో మంగళవారం రాత్రి రెజ్లర్ల మధ్య జరిగిన గొడవలో 23 ఏండ్ల సాగర్‌ మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

 Missing Star Wrestler Sushil Kumar-TeluguStop.com

విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేశారు.సంఘటనా స్థలంలో లభించిన ఐదు వాహనాలు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గురిఖ్‌ బాల్‌ సింగ్‌ సిద్ధు పేర్కొన్నారు.

ఈ ఘటనలో స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పాత్రను పరిశీలిస్తున్నామన్నారు.ఇంకా మరిన్ని విషయాలు గురిఖ్‌బాల్‌ సింగ్‌ సిద్ధు తెలిపారు.

 Missing Star Wrestler Sushil Kumar-కనిపించకుండపోయిన స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయన మాట్లాడుతూ.మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలో ఇండియన్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ కు చెందిన ఇంట్లో సాగర్, అతని స్నేహితులు ఉంటున్నారు.

అయితే వారిని ఖాళీ చేయమని కోరారు.

ఆ విషయంలో ఇరువర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు పోలీస్‌ కంట్రోల్ రూమ్‌ కు సమాచారం అందింది.దీంతో ఘటనస్థలానికి చేరుకున్న మోడల్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలంలో ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు సాగర్‌ కుమార్‌ మృతి చెందగా సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) గుర్తించినట్లు తెలిపారు.

దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్‌ చేసి పార్క్‌ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్‌ చేసిన గన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.కేసు దర్యాప్తు భాగంగా సుశీల్‌ కుమార్‌ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశాం.

అక్కడ సుశీల్‌ కుమార్‌ లేడు.పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్‌ కుమార్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

#Police #Sushil Kumar #Firing #Missing #Wrestler

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు