సహజంగా పెళ్లి అంటే మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, స్నేహితులు, బంధువుల సమక్షంలో చాలా హడావిడిగా అందమైన డెకరేషన్, సాంప్రదాయ పద్ధతిలో జరుగుతూ ఉండటం చూస్తూనే ఉంటాం.కానీ అదే ప్రేమ వివాహం అయితే ఇవి ఏవీ కనిపించవు.
కేవలం ఏదో ఒక గుడిలో కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కానీ, ఆర్యసమాజ్ లో కానీ పెళ్లి చేసుకుంటూ ఉంటారు.కొందరు అయితే కేవలం సంతకాలతో పెళ్లి చేసుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు.
కానీ, మీరు తెలుసుకోబోయే ప్రేమ జంట పెళ్లి మునుపెన్నడూ కూడా జరిగి ఉండదు.ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా ?!
అసలు విషయంలోకి వెళితే.రవి నాయక్ అనే వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి, అతని పుట్టినరోజు సందర్భంగా ఒక శుభకార్యం తలెత్తాలని భావించి ఒక ప్రేమ జంట వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాడు.ఎవరైనా సరే వారి పుట్టినరోజు అంటే ఖరీదైన కానుకలు ఇస్తారు, లేదా విందు భోజనాలు పెడతారు.
కానీ ఇతడు మాత్రం ప్రేమించిన జంటలు ఏకం చేసి దాంపత్య జీవితం అందించాలని నిర్ణయం తీసుకున్నాడు.ఈ క్రమంలో అతని స్నేహితులు పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేశారు.
ఇక అతని మిత్రులు అందరూ కలిసి తాళ్ళపూసపల్లి లోని ఒక గుడిలోతాళ్ళపూసపల్లి లోని ఒక గుడిలో/em> లోని ఒక గుడిలో వివాహం నిర్వహించాలని పెళ్లికి కావాల్సిన మంగళసూత్రం, పూలదండలు అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు.ఇది ఇలా ఉండగా పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ సమయానికి పెళ్లి జరిపించే పురోహితుడుని పిలవడం వారందరూ మర్చిపోయారు.
దీనితో ఇది ఏమీ చేయాలో తెలియక వారిలో ఒకరికి తెలిసిన ఒక పురోహితుడికి ఫోన్ చేసి పెళ్లి మంత్రాలు మొబైల్ ఫోన్ లోనే చదవాలని వారు కోరారు.దాంతో ఒక్క సారిగా షాక్ కు గురైన పురోహితుడు పోనీలే పాపం అంటూస్మార్ట్ఫోన్ లోనే మంత్రాలు చదువుతుంటే, మరోవైపు వధూవరులు ఇద్దరు ఒకటై పోయారు.
బాజాభజంత్రీలు లేకపోవడంతో గుడి గంటలే వారికి మేళతాళాలయ్యాయి.మిత్రులలే బంధువులై అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రాబోయే రోజులలో పెళ్లిళ్లు కూడా ఇలానే నిర్వహిస్తారు ఏమో మరి.ఇదివరకు కాలంలో కూడా ఎంగేజ్ మెంట్ కార్యక్రమాలు కూడా కొన్ని ఆన్లైన్లోనే జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.