వైరల్.. 24 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన చనిపోయిన వ్యక్తి.. కానీ..?

చనిపోయిన తర్వాత ఎవరైనా తిరిగి బతుకుతారా.బ్రతకరు కదా.

 Missing For 24 Years Uttarakhand Man Assumed Dead Family Returns Village-TeluguStop.com

కానీ ఒక వ్యక్తిని చనిపోయాడని అనుకుని అంత్యక్రియలు కూడా నిర్వహించారు.కానీ చివరకు అతడు బ్రతికి వచ్చాడు.

దీంతో అందరు ఆశ్చర్య పోయారు.ఒకటి కాదు రెండు చనిపోయాడు అనుకున్న 24 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటికి రావడంతో కుటుంబం మొత్తం షాక్ అయ్యారు.

 Missing For 24 Years Uttarakhand Man Assumed Dead Family Returns Village-వైరల్.. 24 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన చనిపోయిన వ్యక్తి.. కానీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అతడిని ఇంట్లోకి రానివ్వలేదు.

ఎందుకా అని అనుకుంటున్నారా.

అవును మీరు విన్నది నిజమే.చనిపోయిన వ్యక్తి బ్రతికి వస్తే ఎవరైనా ఆనందంతో వాళ్ళను హత్తుకుని వాళ్ళను వెంటనే ఇంట్లోకి తీసుకు వెళతారు.

కానీ ఆ వ్యక్తిని మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు.కనీసం అతడిని భార్యతో కూడా మాట్లాడనివ్వలేదు.

అదేంటి ఎందుకు అలా చేసారా అని అనుకుంటున్నారా.

ఈ ఘటన అల్మోరా జిల్లా రాణిఖేత్ లో జరిగింది.

ఆ ప్రాంతానికి చెందిన మాదో సింగ్ మెహ్రా కొన్ని సంవత్సరాలుగా కనిపించడం లేదు.చాలా సంవత్సరాల పాటు కుటుంబం మొత్తం అతడిని వెతికారు.

కానీ అతడి ఆచూకీ మాత్రం దొరకలేదు.అయితే వాళ్ళు పండితుడిని కలిసి అతడి జాతకాన్ని చూపించారట.

అప్పుడు అతడి జాతకాన్ని చుసిన పండితుడు అతడు బ్రతికే అవకాశం లేదని చెప్పాడట.

దీంతో కుటుంబ సభ్యులు అతడికి అంత్యక్రియలు జరిపించారు.అయితే ఇప్పుడు అంటే సరిగ్గా 24 సంవత్సరాల తర్వాత అతడు మళ్ళీ తిరిగి వచ్చాడు.దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

అయితే వెంటనే అతడిని ఇంట్లోకి రానివ్వలేదు.ఎందుకంటే అతడికి అంత్యక్రియలు జరిగాయి కాబట్టి చనిపోయినట్లే లెక్కట.

అందుకే మళ్ళీ అతడికి కొత్తగా నామకరణం చేసిన తరువాతే ఇంట్లోకి రానివ్వాలని పండితుడు తెలిపాడట.అందుకే నామకరణం తర్వాతే ఇంట్లోకి రాణిస్తారట.

ఏదైతేనేం చనిపోయాడు అనుకున్న వ్యక్తి మళ్ళీ రావడం నిజంగా ఆశ్చర్యమే.

#Uttarakhand #Dead Man Alive #MissingFor #DeadMan #Almora

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు