ఆడుకొనే మైదానంలో మిస్సైల్..ఆశ్చర్యపోయిన పిల్లలు..!

తాజాగా ఓ ఆట స్థలంలో ఓ చిన్నపాటి మిసైల్ పెద్ద కలకలం రేపింది.కొందరు వీధిలోని పిల్లలు క్రికెట్ ఆడేందుకు ఆటస్థలం లోకి వెళ్లి వికెట్లను నెలలో పాతే ప్రయత్నం చేస్తుండగా భూమిలో వారికి ఏదో గట్టిగా తగులుతున్నట్లు అనిపించడం జరిగింది.

 Missile On The Playing Field Sheltered Children-TeluguStop.com

వికెట్లను పెద్ద రాళ్ళతో కొట్టిన అది లోపలికి వెళ్లకపోవడంతో భూమిలో బండరాయి ఉందేమోనని పిల్లలు తవ్వి చూశారు.అలా చూడడంతో పిల్లలు ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.

అక్కడ ఉన్నది బండరాయి కాదని.ఓ చిన్నపాటి మిస్సైల్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

 Missile On The Playing Field Sheltered Children-ఆడుకొనే మైదానంలో మిస్సైల్..ఆశ్చర్యపోయిన పిల్లలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సంఘటన చెన్నై నగరంలోని పెరియపాలయం ఏరియాలో తాజాగా చోటుచేసుకుంది.

ఇకపోతే ఆట స్థలంలో ఓ తేలికపాటి మిస్సైల్ బయటపడడంతో ఆ విషయం కాస్త స్థానికంగా ప్రజలలో కలకలం రేపింది.

అక్కడే మిగిలిపోయిన మిస్సైల్ పేలితే ఎవరికైనా ప్రమాదం జరుగు వచ్చునని గ్రహించిన స్థానికులు వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారాన్ని అందించారు.దానితో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు బాంబు స్క్వాడ్ కి సమాచారాన్ని ఇవ్వగా వెంటనే బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకొని ఆ మిసైల్ జాగ్రత్తగా హేండిల్ చేశారు.

ఆ తర్వాత బాంబు స్క్వాడ్ వారు దానిని నిశితంగా పరిశీలించి జాగ్రత్తగా దానిని ధ్వంసం చేస్తారని పోలీసులు తెలిపారు.ఇకపోతే మిస్సైల్ ఎనిమిది కిలోల బరువు ఒక అడుగు పొడవు ఉంది.

ఒకవేళ పిల్లలు వికెట్ ను గట్టిగా కొట్టి ఉంటే ఇలాంటి ప్రమాదం సంభవించి ఉంటుందో కదా

.

#Kids #Police #Fire Department #Play Ground #Missile

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు