తృటిలో తప్పిన ముప్పు.. అగ్ని ప్రమాదంలో విమానం సేఫ్..

అప్పుడప్పుడు పెను ప్రమాదాలు తృటిలో తప్పిపోతుంటాయి.అలా జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని, అందుకే తమను రక్షించాడని చాలా మంది భావిస్తుంటారు.

 Watch Video: Missed Threat At Mumbai Airport , Air India Plane Safe In Fire , Ai-TeluguStop.com

అది వారి నమ్మకం.కాగా, ఇటువంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో పెను ముప్పు తప్పింది.సదరు ప్రమాదం వివరాల్లోకెళితే.

ఓ ఎయిరిండియా విమానాన్ని రన్‌వే మీదకు లాక్కెళ్తున్న అక్కడే ఉన్న టోయింగ్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఆ టైంలో విమానంలో 85 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉండటం గమనార్హం.

అలా మంటలు చెలరేగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.దాంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది.అలా ఎయిరిండియా విమాన సిబ్బంది, విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జరిగింది.విమాన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా ఘోరమైన ప్రమాదం జరిగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


టోయింగ్ వాహనానికి మంటలు అంటుకున్న క్రమంలో ఆ వెహికల్ కు కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే ఎయిరిండియా విమానం ఉంది.ఒక వేళ ఆ విమానానికి ఫైర్ అంటుకున్నట్లయితే పరిస్థితులు వేరేలా ఉండేవి.అయితే, టోయింగ్ వెహికల్ మంటలకు పూర్తిగా దగ్ధమైపోయింది.ఎందుకు అలా మంటలు చెలరేగాయనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

జనరల్‌గా టోయింగ్ వెహికల్ పర్యవేక్షణ కంపల్సరీగా ఉంటుందని, కానీ, దాని పర్యవేక్షణలో ఏదేని లోపాలు ఉండొచ్చని, అందుకే ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.ఎయిరిండియా విమానంలోకి మంటలు అతి త్వరగా వ్యాపించే అవకాశాలు కూడా ఉండగా, సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడం వలన పరిస్థితులు అదుపులోకి రాగలిగాయి.

ఈ ప్రమాద ఘటన ఎయిర్ పోర్టులో కలకలం రేపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube