పైలట్ చాకచక్యం తో తప్పిన పెను ప్రమాదం....హ్యాట్సాఫ్ చెబుతున్న ప్రయాణికులు

మయన్మార్ లో అతిపెద్ద విమాన ప్రమాదం తప్పింది.ఇటీవల రష్యా లో విమానము కూలి 40 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

 Missed Aircraft In Myanmar-TeluguStop.com

అయితే ఆ ఘటన మరువక ముందే మయన్మార్ లో విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది.అయితే పైలట్ చాకచక్యం తోనే అతిపెద్ద విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు తప్పించుకోగలిగారు.

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మయన్మార్ లో పైలట్ చాకచక్యం తో వ్యవహరించడం తో 89 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగలిగారు.

వివరాల్లోకీ వెళితే….యాంగోన్ లోని మాండలే విమానాశ్రయంలో విమానం ల్యాండ్ చేస్తున్న సమయంలో విమానం ముందు టైర్లు తెరుచుకోలేదు.

అయినప్పటికీ పైలట్ చాకచక్యం తో వ్యవహరించి అత్యంత జాగ్రత్తగా విమానం వెనుక టైర్లు సాయం తో నిదానం గా ల్యాండ్ చేశాడు.

దీనితో ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు.

పైలట్ వ్యవహరించిన తీరుకి అందరూ ప్రశంసలు అందుకున్నారు.ఒకవేళ ఆ సమయంలో పైలట్ చాకచక్యం తో వ్యవహరించి ఉండక పొతే, ఏమాత్రం విమానం ముందు భాగం రన్ వే కు తగిలినా విమానం బూడిదయ్యేది.కానీ పైలట్ మాత్రం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి విమానం ల్యాండ్ చేయడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.96 నుంచి 114 మధ్య సీట్లు ఉన్న ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది 82 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్ అభినందనలు అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube