స్టార్ హీరోయిన్ కూతురి ఇంస్టాగ్రామ్ అకౌంట్  హ్యాక్... దాంతో.... 

1994 వ సంవత్సరంలో మిస్ ఇండియా మరియు మిస్ యూనివర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ “సుష్మితా సేన్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు హైదరాబాదులో పుట్టి పెరిగినప్పటికీ సినిమా అవకాశాల కోసం ముంబైకి వెళ్లి అక్కడే స్థిరపడింది.

 Miss Universe Sushmita Sen Daughter Renee Sen Instagram Hacked, Sushmita Sen,  M-TeluguStop.com

 కాగా ప్రస్తుతం సినిమాలకి గుడ్ బై చెప్పి మోడలింగ్ రంగంలో భాగానే రాణిస్తోంది. కాగా పెళ్లి మరియు కుటుంబ బాధ్యతలు తన కెరియర్ కి అడ్డు కాకూడదని ఈ అమ్మడు ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

 దీంతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని  వారి బాగోగులను చూసుకుంటోంది.

కాగా తాజాగా సుష్మితా సేన్ పెద్ద కూతురు “రెనీ సేన్” ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.

 అంతేగాక ఈ విషయం గురించి పోస్టు కూడా షేర్ చేసి తన కూతురు ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని కాబట్టి దయచేసి ఎవరు కూడా రెనీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో కావద్దని సూచించింది.

దీంతో కొందరు వ్యక్తులు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సెలబ్రిటీల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు వారిని గుర్తించి శిక్షించాలని కోరుతున్నారు.

అయితే ఈ  విషయం ఇలా ఉండగా సుష్మితా సేన్ ప్రస్తుతం బాలీవుడ్ కి చెందిన “రోమన్ షాల్” అనే మోడల్ తో ప్రేమలో పది సహజీవనం కూడా చేస్తోంది.దీంతో తొందర్లోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు  పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ మధ్య టాలీవుడ్ సెలెబ్రిటీల ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ ఖాతాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు.దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో మళ్లీ తిరిగి గుర్తించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube