'మిసెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' నుండి ఫస్ట్ సింగిల్ ఆగయా.. యూత్ టార్గెట్ గా..

అనుష్క శెట్టి (Anushka Shetty) .ఈమె పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Miss Shetty Mr Polishetty First Single, Anushka Shetty, Naveen Polishetty, Miss-TeluguStop.com

ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈమె బాహుబలి సిరీస్ తో పాన్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యింది.ఈ సినిమాతో ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో అనుష్క కూడా అంత క్రేజ్ తెచ్చుకుంది అనే చెప్పాలి.

అయితే ఈమె లాస్ట్ గా తెలుగులో నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా తర్వాత ఈమె లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”మిసెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”(Miss Shetty Mr Polishetty).ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా రారా కృష్ణయ్య సినిమాతో డైరెక్టర్ గా మారిన మహేష్ (Mahesh Babu P) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

<img src="

“/>

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.అనుష్క ఇప్పటి వరకు ఎప్పుడు చేయని డిఫెరెంట్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయి లైఫ్ లోకి పోలిశెట్టి ఎలా వెళ్ళాడు అనే దానిపై ఈ కథ ముందుకు సాగనుంది.

ఇదిలా ఉండగా ఈ రోజు ఉగాది కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది.పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్ లో ఉన్న కష్టాలను చెబుతూ ఈ సాంగ్ సాగుతుంది.”పుత్తడి బొమ్మ” అంటూ సాగిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టు కుంటుంది.చూడాలి అనుష్క కెరీర్ కు ఈ సినిమా అవుతుందో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube