'మిస్ శెట్టి ..మిస్టర్ పోలిశెట్టి' క్లోసింగ్ కలెక్షన్స్..ప్లాప్ అవుతుంది అనుకున్న ఈ సినిమాకి ఇంత లాభాలు వచ్చాయా!

రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రాలలో ఒకటి ‘మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి'( Miss Shetty Mister Polishetty ) చిత్రం.

 Miss Shetty Mister Polishetty Closing Collections,miss Shetty Mister Polishetty,-TeluguStop.com

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏమి లేవు.టీజర్, ట్రైలర్ మరియు పాటలు ఇలా ఏవి కూడా ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించలేకపోయాయి.

దానికి మొదటి రోజు టాక్ కూడా కాస్త డివైడ్ గా వచ్చింది.అదే రోజు షారుఖ్ ఖాన్ జవాన్( Jawan ) చిత్రం కూడా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకోవడం తో ఈ సినిమా పై తీవ్రమైన ప్రభావం పడింది.

ఓపెనింగ్స్ వరకు బాగా ఎఫెక్ట్ అయ్యాయి కానీ, ఫుల్ రన్ లో మాత్రం స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ సంచలనం సృష్టించింది.

Telugu Anushka Shetty, Madhu Babu, Shettymister-Movie

కేవలం 13 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం కేవలం ఓవర్సీస్ మరియు నైజం ప్రాంతాలకు కలిపి రికవర్ చేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.నైజం ప్రాంతం లో ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ లో కూడా 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.అలా కేవలం ఈ రెండు ప్రాంతాల నుండే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి వచ్చింది ఈ చిత్రం.

ఈ రెండు ప్రాంతాల్లో ఇంత అద్భుతమైన వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఆంధ్ర మరియు సీమ ప్రాంతాల్లో మాత్రం దారుణమైన వసూళ్లు వచ్చాయి.ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాకి కేవలం 4 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

ఇక సీడెడ్ లో అయితే కేవలం కోటి రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది.

Telugu Anushka Shetty, Madhu Babu, Shettymister-Movie

అలా ఓవరాల్ గా ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఆరు కోట్ల రూపాయలకు పైగానే ఓవరాల్ గా లాభాలు వచ్చాయి కానీ , ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం నష్టాలు తప్పలేదు.ఒకవేళ ఈ సినిమా జవాన్ తర్వాత విడుదల అయ్యుంటే ఆంధ్ర లో కూడా మంచి వసూళ్లు వచ్చేవి.ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన థియేట్రికల్ రన్ దాదాపుగా ఆగిపోయింది.

ఇక ఎంత వచ్చిన ఓవర్సీస్ మరియు నైజాం( Miss Shetty Mister Polishetty Collections ) నుండే రావాలి.ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం మరో రెండు కోట్ల రూపాయిలు షేర్ ని రాబట్టే అవకాశం ఉందట.

చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube