మిస్ ఇండియా వెనకాల ఇన్ని కష్టాలు ఉన్నాయా..?!

తెలంగాణ యువ ఇంజినీర్‌ మానసా వారణాసి(23) వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఫెమినా మిస్‌ ఇండియా 2020 ఫైనల్‌ పోటీలు 10 ఫిబ్రవరి,2021న ముంబైలో జరిగాయి.

 Miss India, Runner Up, Struggle, Viral Latest, Miss India Women, Soclai Media,co-TeluguStop.com

ఆమెతో పాటు వీఎల్‌సీసీ ఫెమీనా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానిక షికాండ్‌కు, మాన్యా సింగ్‌కు రన్నరప్ కిరీటాలు అలకరించారు.కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మాన్యా సింగ్‌ మరోసారి రుజువు చేశారు.

పుట్టింది పేదకుటుంబంలో అయినా తన కళ నెరవేర్చుకోవడం కోసం చాల కష్టాలు పడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఆమె.

మిస్ ఇండియా రన్నరప్ మాన్యా సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఖుషీ నగర్ లో జన్మించారు.ఆమె ఆటో డ్రైవర్ కూతురు.ఇక ఆమె ఎన్నో రోజులు నిద్ర లేకుండా, తిండి లేకుండా గడిపాను.కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నాను.మా నాన్న ఆటో డ్రైవర్.

చాలీచాలని సంపాదనే వచ్చేది.స్కూలుకు వెళ్ళడానికి ఆర్థిక పరిస్థితి సహకరించేది కాదు.

అలాంటి సమయంలో చిన్న వయసులోనే నేనూ పనిచేయాల్సి వచ్చింది.నా పరీక్ష ఫీజు కట్టేందుకు ఉన్న కొద్దిపాటి నగలనూ అమ్ముకోవాల్సి వచ్చింది.

నా కోసం మా అమ్మ చాలా కష్టపడింది’’ అని చెప్పుకొచ్చింది.

Telugu India, Soclai, Struggle, Latest-Latest News - Telugu

ఇక 14 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయానని మాన్య చెప్పింది.‘‘కొన్ని ఇళ్లలో అంట్లు తోమే పనికి కుదిరాను.పొద్దునంతా చదువు.

సాయంత్రమంతా పని.ఆ తర్వాత రాత్రి కాల్ సెంటర్ లో ఉద్యోగం.మొత్తంగా ఏదోలా చదువు పూర్తి చేశాను.రిక్షాకు ఎక్కువ డబ్బులు అవుతాయని స్కూలు, పని ప్రదేశాలకు నడిచి వెళ్లేదాన్ని.అలా మిగిలిన డబ్బులను ఆదా చేసేదాన్ని.

నేడు మిస్ ఇండియా వేదిక మీద ఉన్నానంటే దానికి కారణం మా నాన్న, అమ్మ, తమ్ముడు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే.

అనుకున్న కలలను తీర్చుకోవాలనుకునే తపన ఉంటే.ఏదైనా సాధ్యమవుతుందని నిరూపించొచ్చని ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశంతోనే నా కథ చెప్పా’’ అని మాన్య తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరంగా చెప్పుకొచ్చింది.

నా రక్తం, చెమట, కన్నీళ్లు అన్నీ కలగలిపి ధైర్యంగా నూరిపోసుకుని కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడ్డా.అని డిసెంబరులో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube