నాలో లోపముందని బాధపడేదాన్ని.. రేవతి సురేష్ కీలక వ్యాఖ్యలు..!

మహానటి సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.కీర్తి సురేష్ కు రేవతి సురేష్ అనే సోదరి ఉండగా రేవతి ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 Miss India Keerthy Suresh Sister Weight Loss Journey,viral,latest Tollywood News-TeluguStop.com

కొన్ని నెలల క్రితం వరకు బొద్దుగా ఉన్న రేవతి సురేష్ బరువు తగ్గడంతో పాటు ఎక్కువ బరువు ఉన్న సమయంలో ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

తన బరువు గురించి కామెంట్లు చేసిన వారికి బరువు తగ్గి సమాధానం చెప్పిన రేవతి అధిక బరువు ఉండటం వల్ల తల్లితో, సోదరితో పోల్చి కొందరు తనను ఎగతాళి చేసేవారని తెలిపారు.

బరువు వల్ల ఎన్నో అవమానాలు ఎదురు కావడంతో నాలో ఏదో లోపం ఉందని బాధ పడేదానినని ఆమె అన్నారు.ఇతరులతో పోల్చడం వల్ల తనపై తనకే నమ్మకం పోయిందని భర్త ప్రపోజ్ చేస్తే కూడా నాలో ఏముందనే అనుమానం కలిగిందని తెలిపారు.

ఒక మహిళ తల్లి, చెల్లి అందంగా కనిపిస్తుంటే మీరు ఇలా ఉన్నారేంటి.? అని ప్రశ్నించిందని అలా ఎదురైన అవమానాల వల్ల తనను తానే అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని రేవతి అన్నారు.లావుగా ఉండటం వల్ల తాను సంతోషంగా ఉండలేనని భావించానని పేర్కొన్నారు.అయితే చెల్లి కీర్తి సురేష్ మాత్రం తన బరువు గురించి ఎవరైనా కామెంట్లు చేస్తే కౌంటర్ ఇచ్చి అండగా నిలిచేదని ఆమె అన్నారు.

చెల్లి స్నేహితులలో కొందరు కీర్తి కంటే తానే అందంగా చెప్పేవారని కీర్తి చెప్పేదని ఆ జోక్ కు తాను నవ్వేదానినని ఆమె అన్నారు.తాను 20 కేజీలు బరువు తగ్గానని.

బరువు తగ్గడానికి సహాయం చేసిన గురువు యోగ ఆచార్య, మరో గురువు తర సుదర్శన్ లకు ధన్యవాదాలు అని ఆమె పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube