పంచాయతీ పోరులో మిస్ ఇండియా ఫైనలిస్ట్..!

2015 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టు గా నిలిచిన దీక్షా సింగ్ తాజాగా పొలిటికల్ ఎంట్రీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జాన్‌పూర్ జిల్లా… బక్షా డెవెలప్‌మెంట్ బ్లాక్… వార్డ్ నంబర్ 26 నుంచి ఆమె పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

 Miss India Finalist Diksha Singh Contesting For Panchayat Elections In Uttarprad-TeluguStop.com

ఈ రాష్ట్రంలో మొదటి పంచాయతీ ఎన్నికలు ఏప్రిల్ 15వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం నేటితో ముగియనున్నది.

ఈ నేపథ్యంలోనే దీక్షా సింగ్ ఎన్నికల బరిలోకి దిగి భారత దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.

నిజానికి వార్డ్ నెంబర్ 26 నుంచి దీక్షా తండ్రి పోటీ చేయాలనుకున్నారు.

కానీ ఈసారి ఆ సీట్ ఆడవాళ్లకు రిజర్వ్ అయింది.దీనితో ఆయన తన కూతుర్ని ఎన్నికల బరిలోకి దింపారు.

నిజానికి ఈ సీటు నుంచి గెలవాలని ఆమె తండ్రి ఎప్పటి నుంచో బాగా ఆశపడుతున్నారు.వృత్తిరీత్యా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాన్ అయిన ఆమె తండ్రి గోవా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రస్తుతం వ్యాపారం కొనసాగిస్తున్నారు.

అయితే రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలని ఆయన తపన పడుతున్నారు కానీ ఆ కోరిక మాత్రం నెరవేరడం లేదు.దీంతో కనీసం తన కుమార్తె ద్వారా అయినా తన ఆశయం నెరవేరుతుంది ఏమోనని ఆమెను నిలబెట్టారు.

Telugu India Finalist, Diksha Singh, Janpur, Panchayat, Latest-Latest News - Tel

దీక్షా సింగ్ కి పోటీగా బీజేపీ పార్టీ నేత రామచంద్ర సింగ్ కోడలు షాలిని సింగ్ పోటీ చేస్తున్నారు.అయితే శాలిని సింగ్ పై దీక్ష గెలవడం కష్టమేనని అక్కడి రాజకీయ పండితులు ముందస్తుగానే జోస్యం చెబుతున్నారు.ఇదిలా ఉండగా.దీక్ష ప్రస్తుతం చాలా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు.రెండు నెలల క్రితం ఆమె చేసిన “రబ్బా మెహర్ కారీ” పాట సూపర్ హిట్ అయ్యింది.ఈ అందాల తార ఎన్నికల ప్రచారం చేస్తుంటే వేలమంది ప్రజలు తరలి వస్తున్నారట.

మరి ఆమె అందం ఓట్ల షేర్ లో ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube