కమలా హరీస్ పై మిషెల్ పొగడ్తల వర్షం...వ్యూహాత్మకమేనా..??

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ఊహించని విధంగా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారీస్ ను తెరపైకి తీసుకువచ్చిన విషయం విధితమే. కమలా పేరు ప్రకటించగానే జరిగిన జరుగుతున్న పరిణామాలు కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు.

 Mishel Obama Praise The Kamala Harish, Mishel Obama, Obama, America President El-TeluguStop.com

అయితే డెమోక్రటిక్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా రానున్న ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ట్రంప్ చేస్తూ వచ్చిన తప్పిదాలను తమకి అనుకూలంగా మలుచుకుంటూ గెలుపు దిశగా దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే అమెరికాలో 40 మిలియన్స్ జనాభా ఉన్న ఆఫ్రో అమెరికన్స్ ఓట్లే టార్గెట్ గా వ్యూహాలు సిద్దం చేస్తోంది.

ట్రంప్ నల్లజాతీయులపై చూపించిన జాత్యాహంకారాన్ని తమకి అనుకూలంగా మలుచుకోవడంలో సక్సస్ అయిన డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు వారిని ఓట్ల రూపంలో మార్చడానికి సిద్దమయ్యింది.

ఈ క్రమంలోనే కమలా హారిస్ ఎంపిక జరుగగా ఆమెకి నల్లజాతీయుల మద్దతు కూడా గట్టేందుకు ఒబామా కృషిచేస్తున్నారు.ఒబామా కమలా కి బహిరంగంగా మద్దతు తెలుపగా ఒబామా సతీమణి మిషెల్ ఒబామా కూడా నల్లజాతీయుల మద్దతు కమలా హారీస్ కి కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా కమలా హారీస్ ఎంపికపై మిషెల్ హర్షం వ్యక్తం చేశారు.

Telugu America, Black Peoples, Democratic, Joe Bidden, Kamala Haris, Mishel Obam

రంగుతో సంభంధం లేకుండా కమలా ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకోవడంలో ఎంతో కృషి పట్టుదల, ఉన్నాయని

ఎంతో మందికి ముఖ్యంగా నల్ల జాతీయులకి కమలా ఓ ఆదర్సమని అన్నారు.ఈ పదవికి ఆమే అర్హురాలని ఆమె తెలిపారు.చిన్న వయసులోనే ఆమెకి ఈ పదవి దక్కడం ఎంతో సంతోషమని తెలిపారు.

భారతీయ అలాగే ఆఫ్రో మూలలున్న ఓ మహిళ మొదటి సారిగా ఈ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం గర్వించతగ్గ విషయమని దేశాన్ని సమర్ధవంతంగా నడిపించేందుకు ఆమె శక్తి సామర్ధ్యాలు ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube