పిల్లి కోసం వంగిన వృద్ధురాలు.. ఇంతలోనే?

ఈ మధ్య కాలంలో దొంగతనాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.పట్టపగలే అమాయకులను టార్గెట్ చేసి దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు.

 Miscreant Gold Chain Snatching In Krishna District Gannavaram-TeluguStop.com

తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక వ్యక్తి పాత సామానులు కొంటాననే నెపంతో వృద్ధురాలిని మోసం చేసి వృద్ధురాలి మెడలోని గొలుసును దొంగలించాడు.

కేసరపల్లి పంచాయతీ కార్యాలయం సమీపంలో నివాసం ఉండే మూల్పూరు పద్మావతి గొలుసు పోయీ లబోదిబోమంటోంది.

శుక్రవారం రోజు చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒక వ్యక్తి పాత టీవీలు, పాత సామానులు కొనుగోలు చేస్తానని పద్మావతి అనే వృద్ధురాలికి చెప్పాడు.తమ ఇంట్లో అలాంటి వస్తువులు లేవని వృద్ధురాలు బైక్ పై ఉన్న వ్యక్తికి సమాధానం ఇచ్చింది.

అదే సమయంలో పద్మావతి ఇంట్లో ఉన్న పిల్లి పిల్లలను చూపించి తనకు పిల్లులు అంటే ఎంతో ఇష్టమని ఒక పిల్లిని పెంచుకుంటానని దుండగుడు వృద్ధురాలిని కోరాడు.

వృద్ధురాలు అందుకు అంగీకరించి పిల్లిని పట్టుకోవడానికి వంగిన సమయంలో దుండగుడు వృద్ధురాలి మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసును దొంగలించాడు.

కళ్లు మూసి తెరిచే సమయంలో మెడలోని గొలుసును యువకుడు దొంగలించడంతో వృద్ధురాలు కొన్ని క్షణాల పాటు షాక్ కు గురైంది.అనంతరం వృద్ధురాలు గన్నవరం పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube