ఈ హీరో తన కాలేజీ ఫీజు కట్టడానికి అప్పట్లో చాలా కష్ట పడ్డాడట... కానీ ఇప్పుడు....

మామూలుగా సినిమా పరిశ్రమకి ఎలాంటి సినీ కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి నటీనటుల్లో మొదట్లో అవకాశాల కోసం కొంతమేర కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత బాగానే నిలదొక్కుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.అయితే ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో అలీ ఫైజల్ ఒకడు.

 Mirzapur Web Series Fame Ali Fazal About His Struggles Before Movies, Ali Fazal,-TeluguStop.com

అలీ ఫైజల్ ముందుగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన “త్రీ ఇడియట్స్” చిత్రం లో  ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలలో హీరోగా నటించే అవకాశాలు తెచ్చుకుని దూసుకుపోతున్నాడు.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటుడు అలీ ఫైజల్ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన రియల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ఒకప్పుడు తన కాలేజీ లో చదువుకునే సమయంలో తన ఫీజు కట్టడం కోసం పలు చోట్ల  పని చేశానని ఆ తర్వాత తనకి సినిమాలపై మనసు మల్లడంతో తెలిసిన వారి ద్వారా పలు చిత్ర ఆడిషన్స్ లో పాల్గొన్నానని చెప్పుకొచ్చాడు.  జీవితంలో ఎవరైనా సరే మొదటి మెట్టు ఎక్కేటప్పుడు మాత్రమే కష్టపడతారని ఆ తర్వాత విజయతీరాలకు చాల సులభంగా చేరుకుంటారని ఆ విషయం తాను బాగా నమ్ముతానని తెలిపాడు.

కాగా అలీ ఫైజల్ బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్లో కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు.కాగా ప్రస్తుతం మీర్జాపూర్ రెండవ సీజన్ తో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటున్నాడు.

ఇటీవలే బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా తో ప్రేమలో పడి వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరికి తాజాగా నిశ్చితార్థం కూడా జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube