బాలయ్య సర్జరీ కారణంగా అలా ప్లాన్ చేసిన నిర్మాతలు.. ఏం చేశారంటే?

Miryala Ravinder Reddy About Akhanda Movie

నందమూరి నట సింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తి చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

 Miryala Ravinder Reddy About Akhanda Movie-TeluguStop.com

ఇప్పటికే బోయపాటి శ్రీను బాలకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సింహా, లెజెండ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.ఈ క్రమంలోనే ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా డిసెంబర్ 2వ తేదీ విడుదల కావడంతో నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.

 Miryala Ravinder Reddy About Akhanda Movie-బాలయ్య సర్జరీ కారణంగా అలా ప్లాన్ చేసిన నిర్మాతలు.. ఏం చేశారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా బాలకృష్ణ గురించి బయట చెప్పుకొనే విధానం చూస్తే ఆయనతో సినిమాలు చేయాలంటే చాలా మంది వెనుకడుగు వేస్తారు.

కానీ ఒక్కసారి ఆయనతో జర్నీ చేస్తే మరొక బాలకృష్ణను మనం చూడవచ్చని ఆయన చెప్పారు.ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో ఎంతో అద్భుతంగా నటించారని తెలిపారు.

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కన్నార్పకుండా చూస్తారని అంత అద్భుతంగా సినిమా వచ్చిందని రవీందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు ఇకపోతే ఈ సినిమా విడుదల దగ్గర పడటంతో ప్రీ రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించారు అయితే బాలకృష్ణ గారికి సర్జరీ జరగడం వల్ల ఫ్రీ రిలీజ్ వేడుకను శిల్పకళా వేదిక లో చాలా సింపుల్ గా ప్లాన్ చేశామని ఈ సందర్భంగా నిర్మాత రవీందర్రెడ్డి మీడియాకు తెలిపారు.

#Boyapati #Relese #Balakrishna #Pragya Jaiswal #Ravinder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube