నువ్వు యాక్టర్ గా పనికి రావని ఆ డైరెక్టర్ అవమానించాడు... చివరికి...

తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో విలన్ మరియు పాజిటివ్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు “ఆదిత్య మీనన్” గురించి సినీ ప్రేక్షకులకి సుపరిచితమే.అయితే నటుడు ఆదిత్య మీనన్ అంటే కొంతమందికి త్వరగా గుర్తు రాక పోవచ్చు కానీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “మిర్చి” చిత్రంలో హీరో బాబాయ్ క్యారెక్టర్ అంటే టక్కున గుర్తు పడతారు.

 Mirchi Movie Fame Actor Aditya Menon Facing Insults In Movie Shooting Sets, Mirc-TeluguStop.com

ఇటీవలే ఆదిత్య మీనన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన సినీ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తాను సినిమాల్లోకి రాక ముందు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో ఈవెంట్ మేనేజర్ గా పని చేశానని దాంతో అప్పట్లో మంచి జీతం, జీవితం బాగుండేదని కానీ నటనపై ఆసక్తి కలగడంతో అన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు.

అయితే వచ్చీరావడంతోనే ఓ చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చిందని కానీ తన పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోవడంతో నటించనని దర్శకుడితో చెప్పడంతో ఆ దర్శకుడు తనని దారుణంగా అవమానించాడని తెలిపాడు.

Telugu Adithya Menon, Aditya Menon, Adityamenon, Biila, Mirchi, Mirchiaditya, Te

ఈ క్రమంలో నువ్వు యాక్టర్ గా పనికిరావు, నీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేరంటూ కొంతమేర అవమానకరంగా మాట్లాడాడని చెప్పుకొచ్చాడు.కానీ కొంతకాలం తర్వాత తాను మెయిన్ విలన్ గా నటించిన ఓ చిత్రానికి ఆ దర్శకుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడని తెలిపాడు.కానీ తనని సినిమా సెట్లో అవమానించిన డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.

ఇక తనకి తెలుగులో మొదటగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “బిల్లా” చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని కానీ తమిళంలో బిల్లా చిత్రంలో నటించిన నటీనటులు తెలుగు రీమేక్ లో కూడా కంటిన్యూ చేయడం వల్ల ఆ అవకాశం తనకు వచ్చిందని తెలిపాడు.

Telugu Adithya Menon, Aditya Menon, Adityamenon, Biila, Mirchi, Mirchiaditya, Te

అయితే తాను అప్పుడప్పుడు తన బ్లాగ్ లో ఆడవాళ్ళ పై జరుగుతున్న అకృత్యాల గురించి రాస్తూ ఉంటానని తెలిపాడు.ఇందులో మన భారతదేశ సంప్రదాయాల్లో ఆడవాళ్ల గౌరవానికి పెద్దపీట వేశారని, కానీ ఈ మధ్యకాలంలో కొందరు మహిళలపై తీవ్ర ఆకృత్యాలకు పాల్పడుతున్నారని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.అంతేకాక తన దృష్టిలో ఆలుమగలు ఇద్దరూ సమానమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Telugu Adithya Menon, Aditya Menon, Adityamenon, Biila, Mirchi, Mirchiaditya, Te

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి స్పందిస్తూ తానూ ఇప్పటివరకూ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తదితర భాషలలోని చిత్రాలలో నటించానని కానీ తనని నటుడిగా గుర్తించి ఆదరించింది మాత్రం తెలుగు సినిమా పరిశ్రమని తెలిపాడు.అంతేగాక తెలుగు సినీ పరిశ్రమకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే తనని ఏంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube